పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులు కాస్త దారుణంగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల తర్వాతమమతా బెనర్జీమమతా బెనర్జీ విజయం సాధించిన తర్వాత అక్కడి నుంచి కూడా పరిణామాలు వేగంగా మారిపోవడం భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడులు చేయడం భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను తగలబెట్టే విధంగానూ అక్కడి అధికార పార్టీ కార్యకర్తలు వ్యవహరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రిమమతా బెనర్జీ విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది.

భారతీయ జనతా పార్టీ కావాలనే పశ్చిమ బెంగాల్ లో ఇటువంటి చర్యలకు దిగుతున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో వామపక్షాలు ఇదేవిధంగా చేశాయి. కాబట్టి వాళ్ల విషయంలో దూకుడుగా వెళ్ళిన మమతాబెనర్జీ ఇప్పుడు మళ్లీ అదే చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రత్యర్ధులు లేకుండా చేసే విధంగా గతంలో వామపక్షాలు రాజకీయం చేశారని ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదేవిధంగా రాజకీయం చేస్తూ పశ్చిమబెంగాల్లో దుర్మార్గాలకు పాల్పడుతున్నారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.

అధికార పార్టీ కార్యకర్తలు స్వయంగా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన దాడులు చేయడం అదే విధంగా ఎంపీలు కేంద్ర మంత్రులు అని కూడా చూడకుండా దాడులు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పరిస్థితులు ఉంటే పశ్చిమ బెంగాల్ వెళ్లడానికి కూడా ఇతర రాష్ట్రాల వాళ్లు భయ పడే పరిస్థితులు ఉంటాయని ఈ అంశానికి సంబంధించి వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు దిగాలని అక్కడ ఆర్మీ సహాయంతో చర్యలు చేపట్టాలని కూడా కొంత మంది కోరుతున్నారు. ఆమె గెలిచిన తర్వాత పరిస్థితులు మరింత వేగంగా పెరిగి పోయాయి అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే పశ్చిమ బెంగాల్ లో నెలకొన్న పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: