వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు, అదే పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఉంటూ ప్రతిరోజూ రచ్చబండ పేరిట మీడియా సమావేశం పెట్టి, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే ప్రతిపక్ష టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడారు. ఇక తాజాగా రాజుగారి విమర్శలు హద్దులు దాటాయి. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు సీఎం జగన్‌కు పిచ్చి ఉందని, ఆయనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అలాగే సజ్జలని బిజ్జల అంటూ మాట్లాడారు.


ఇలా రాజు గారు హద్దులు దాటడంతో సి‌ఐ‌డి ఎంట్రీ ఇచ్చింది. రాజద్రోహం కింద రాజుగారిని అరెస్ట్ చేశారు. రాజు గారు అరెస్ట్ కావడంపై వైసీపీ శ్రేణులు బాగా ఆనందంగా ఉన్నాయి. ఇంతకాలం సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన రాజుగారు అరెస్ట్ కావడం సమంజసమే అని అంటున్నారు. ఇదే సమయంలో రాజుగారికి టీడీపీ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఇప్పటికే చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో పాటు పలువురు టీడీపీ నేతలు రాజుగారి అరెస్ట్‌ని ఖండించాయి.


అలాగే సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు రాజుగారికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఆయన అరెస్ట్‌ని ఖండిస్తున్నారు. సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకని నోక్కెస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే రాజుగారి అరెస్ట్‌ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఖండించారు. కరోనా విపత్తు సమయంలో జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. అటు జనసేన కార్యకర్తలు కూడా రాజుగారికి సపోర్ట్‌గా ఉన్నారు. 


ఇలా ఏపీలో అధికార పక్షం రాజుగారి అరెస్ట్‌ కరెక్ట్ అని మాట్లాడుతుంటే, ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం రాజుగారి అరెస్ట్‌పై పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. ఏదో ఒకరిద్దరు నేతలు తప్పా, మిగతా వారు రాజు గారి అరెస్ట్ గురించి పట్టించుకున్నట్లు లేరు. అయితే బీజేపీలో ఉంటూ జగన్ ప్రభుత్వానికి కాస్త అనుకూలంగా ఉన్నవారు రఘురామ అరెస్ట్ కావడంపై స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నేతలు రాజు గారి అరెస్ట్‌ని ఖండిస్తున్నాయి. ఏదేమైనా ఏపీ బీజేపీ నేతలు రాజకీయాలే చాలా డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: