ఇంతకాలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన రఘురామ, అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. కొన్నిరోజులు పార్టీకి అనుకూలంగా ఉన్న రాజు గారు, తర్వాత పూర్తిగా యాంటీ అయ్యారు. ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు.


ప్రతిరోజూ రచ్చబండ పేరిట మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వాన్ని ఏకీపారేస్తున్నారు. తనదైన శైలిలో వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే వైసీపీ నేతలు కూడా రఘురామకృష్ణంరాజుపై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆయన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. కానీ రాజుగారు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వైసీపీపై విరుచుకుపడుతున్నారు.


అయితే గత కొన్నిరోజుల నుంచి రాజుగారి విమర్శలు హద్దులు దాటాయి. సీఎం జగన్‌ని టార్గెట్ చేసుకుని వ్యక్తిగతంగా మాటల దాడి చేయడం మొదలుపెట్టారు. జగన్ ఒక పిచ్చివాడు అంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే రాజుగారిపై రాజద్రోహం కేసు నమోదైంది. ఆయన్ని తాజాగా సి‌ఐడిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్‌గా తన పుట్టినరోజునే రాజుగారు అరెస్ట్ అయ్యారు. అయితే సీఎం జగన్ కావాలనే కక్షపూరితంగా అరెస్ట్ చేశారని టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆయన్ని అరెస్ట్ చేయడం సమంజసమే అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.


అయితే ఇలా రాజుగారు అరెస్ట్ కావడంతో రాష్ట్రంలోని ఇతర సమస్యలు కాస్త డైవర్ట్ అయినట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ప్రజలు సరైన వైద్యసదుపాయలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ సమస్యతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా ప్రభుత్వం రాజుగారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేసింది. దీంతో ఉన్న సమస్యలు పక్కకుపోయి రాజుగారి అరెస్ట్ హైలైట్ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజుగారి అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: