వరుస ఓటములతో ఏపీలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. ఇలా ఓటములు పాలవ్వడంతో చాలామంది టీడీపీ నాయకులు సైడ్ అయిపోతున్నారు. పార్టీ తరుపున పెద్దగా పనిచేయడం లేదు. అసలు 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడే పలువురు నాయకులు సైలెంట్ అయిపోయారు. మరికొందరు వైసీపీలోకి జంప్ కొట్టేశారు.


ఇక ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీలో పలువురు నాయకులు కనిపించడం మానేశారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం పార్టీ కోసం గట్టిగానే పోరాడుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుని, నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు.


అలా పార్టీ తరుపున్న పోరాడుతున్న వారిలో యువ నాయకురాలు బండారు శ్రావణి కూడా ఒకరు. 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నుంచి పోటీ చేసి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దాదాపు 40 వేల ఓట్ల పైనే మెజారిటీతో ఓటమి పాలయ్యారు.


ఇలా భారీ ఓటమి ఎదురైన సరే శ్రావణి వెనక్కి తగ్గకుండా పనిచేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో ఏదొక సమస్య గళం విప్పుతూనే ఉన్నారు. అలాగే కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ, పార్టీ వాయిస్‌ని వినిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపిస్తున్నారు. పార్టీ కోసం నిత్యం కష్టపడుతూనే ఉన్నారు.


అయితే ఇలా కష్టపడుతున్న శ్రావణికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు సులువు కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే శింగనమలలో ఎమ్మెల్యే పద్మావతి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు బాగా అడ్వాంటేజ్ అవుతున్నాయి. జగన్ ఇమేజ్ వైసీపీకి బాగా ప్లస్. కానీ శ్రావణి ఇంకాస్త కష్టపడితే వైసీపీకి చెక్ పెట్టే అవకాశాలున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి పద్మావతి బలంగా ఉండటం వల్ల శింగనమలలో టీడీపీ పూర్తి స్థాయిలో బలం పుంజుకోలేదు. చూడాలి మరి ఎన్నికల నాటికి శ్రావణి బలం పెంచుకుంటారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: