చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ చాలా ఘోరంగా విలయ తాండవం చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో కేసులు రోజుకి తారా స్థాయికి చేరుతున్నాయి. రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు కూడా బాగా ఎక్కువవుతున్నాయి.ఈ నేపథ్యంలో టీకాలు తీసుకోవడం తప్పనిసరి.ఇక మన దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటిక్ వారు తాము తయారు చేస్తున్న టీకాలు ఒక పక్క భారత్ లో కొనసాగిస్తూ మరో వైపు ప్రపంచ దేశాలకు ఉత్పత్తి చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన వ్యాక్సిన్ తయారీ ఫార్ములాని ప్రపంచదేశాలతో పంచుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ వంటి దేశాలు మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. కాని జర్మనీ మాత్రం మద్దతు ఇవ్వలేదు. అందుకు నిరాకరించింది. అలాగే తమ వ్యాక్సిన్ లు పంపిణీ చెయ్యమని చెప్పింది. ఇక ఇది పక్కపెడితే మన శత్రు దేశం చైనా మనకు ఇప్పుడు మద్దతు ఇవ్వడానికి రెడీ అయ్యింది.తమ వ్యాక్సిన్ ని దాని ఫార్ములాని మనతో పంచుకోవడానికి రెడీ అయ్యింది. ప్రజలు కోసం తమ దేశ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించింది.ఒక రకంగా ఇది చైనా తీసుకున్న మంచి నిర్ణయం అనే చెప్పాలి.కాని పూర్తిగా కాదని అనుమానాలు వెళ్లడవుతున్నాయి. ఎందుకంటే ఇందులో కూడా చైనా స్వార్ధం కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చైనా వ్యాక్సిన్ లు ఏ దేశం తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్న తిరిగి వెనక్కి పంపిస్తున్నాయి. అందుకే చైనా ఈ ప్లాన్ చేసిందేమోనని సందేహాలు పుట్టుకోస్తున్నాయి.ఎందుకంటే చైనా ప్రతి విషయంలో ఇండియాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.ప్రతి దాంట్లోనూ మనతో పోటీ పడుతుంటుంది. ఆర్ధికంగా మన కంటే ఎదగాలని మనల్ని అణిచివేయాలని ఎప్పుడు పన్నాగాలు చేస్తుంది.అలాంటి చైనా మనకు మద్దతు ఇస్తుందనే విషయం సందేహానికి గురి చేస్తుంది.ఇది స్వార్ధమో లేక సాయమో అనేది తెలియాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: