రెండు తెలుగు రాష్ట్రాలో రాజకీయం బాగానే సాగుతోంది. రెండు చోట్ల ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. రెండు చోట్ల బలమైన ముఖ్యమంత్రులు పవర్ లో ఉన్నారు. ఇక ప్రజాకర్షణ విషయంలో కూడా వారు ధీటుగానే ఉన్నారు.

మరి ఈ సమయంలో రెండు చోట్ల సందు చేసుకుని రాజకీయం చేసేందుకు మరో పార్టీకి వీలు అవుతుందా అంటే చూడాలి. రాజకీయం అంటేనే పుష్పక విమానం. అందువల్ల లేదు అనుకోకూడదు. ఎవరి ప్రయత్నం వారు చేయాల్సిందే. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి చెంది డీలా పడినా కూడా బీజేపీ అక్కడ వెంటనే సర్దుకుంది. రాజకీయ పోరాటం చేస్తోంది. బండి సంజయ్ మళ్ళీ దూకుడు చేస్తున్నారు. కేసీయార్ సర్కార్ మీద బాణాలు ఎక్కుపెడుతున్నారు.

అదే ఏపీలో చూసుకుంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తరువాత బీజేపీ బాగా డీలా పడిపోయినట్లుగా ఉంది. ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కూడా పెద్దగా సౌండ్ చేయడంలేదు. ఏపీలో ఎంత లాగినా బీజేపీ పైకి ఎదగదు అని భావించారో మరేమో తెలియదు కానీ కమలనాధులు బాగా నిరాశలో ఉన్నాని అంటున్నారు. దాంతో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఈ చాన్స్ ని వాడేసుకుంటోంది. నిజానికి తిరుపతిలో కూడా టీడీపీ వైసీపీల మధ్యనే అతి పెద్ద పోరు నడిచింది. ఆ రెండు పార్టీలు కాదు మేమే అసలీన ఆల్టర్నెషన్ అంటూ దూసుకొచ్చిన బీజేపీ ఒక్క ఉప ఎన్నికలో తేడా కొడితే ఇలా మూలకు చేరడమేంటి అన్న చర్చ కూడా వస్తోందిట. మరి బీజేపీ ఇకనైనా ఏపీలో జోరు చేస్తున్నా ప్రజా సమస్యల మీద గళం విప్పి టీడీపీకి ధీటుగా సీన్ లోకి వస్తుందా. చూడాలి. ఏది ఏమైనా బీజేపీ ఇకనైనా పొత్తుల వైపు మరే ఎత్తుల వైపు చూడకుండా తాను జనాలలోకి దూసుకుపోవాలి. తన పార్టీ సిద్ధాంతాలను జనంలో ఉంచి  ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. అలా చేస్తేనే రేపటి రోజు అయినా రాజకీయ లాభం ఉంటుంది అన్న మట అయితే ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: