తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బ్రతికి ఉన్నప్పుడు ఈ విధంగా అయితే వార్తల్లో నిలిచారో చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూ సంచలనం రేకెత్తిస్తున్నారు.. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తుల గురించి చర్చలు, పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. ఆమె ఆస్తులు నిలయంగా ఉన్న వేద నిలయం ను ఇప్పటి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.. జయలలిత గెస్ట్ హౌస్ గా చెప్పుకునే వేద నిలయంలో వేల జతల చెప్పులు, వందల సంఖ్యలో ఎలక్ట్రానిక్ వస్తువులు, కేజీల కేజీల బంగారం, వెండి దొరికాయి..

ఇవన్నీ దొరికిన సమయంలో అసలు జయలలిత కు ఎన్నికొట్ల ఆస్తి ఉందన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు అధికారులు.. నిజానికి వేద నిలయం లో ఉండే లగ్జరీ వస్తువులను చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.. అంతపురంనే తలదన్నేలా అందులో వస్తువులు ఉన్నాయి అంటే ఆమె ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. వేద నిలయం లో మొత్తం 32,721 వస్తున్నట్లు సంవత్సరం క్రితం ప్రభుత్వం ఓ నివేదిక లో పేర్కొంది..

ప్రపంచం మొత్తం చూసేలా ఆమె దత్త కుమారుడి వివాహం చేసిన తర్వాత ఆమె ఆస్తుల మీద అందరి కన్ను పడింది.. ఒక యువరాజు తరహాలో అతని వివాహం చేసిన ఆమె కు ఎన్ని కోట్ల ఆస్తులు  ఉన్నాయి అప్పుడు అంచనా వేయడం ప్రారంభించారు.. ఆ తర్వాత ఆమె ఆస్తులపై ఐటి సోదాలు నిర్వహించగా బయటపడ్డ వస్తువులు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. అక్రమాస్తుల కేసులో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన  తరువాత లగ్జరీ లైఫ్ కి దూరంగా ఉన్నారు.. ప్రస్తుతం వేద నిలయం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండగా అందులో కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ అధికారులు .. ఏదేమైనా నటిగా, సీఎంగా ఉండి బాగానే కూడా పెట్టారు. అయితే ఆమెకు వారసులు లేకపోవడం కొసమెరుపు..

మరింత సమాచారం తెలుసుకోండి: