మాములుగా ఒక ఆర్థికశాస్త్రం ప్రకారం డిమాండ్ సప్లై సూత్రం ప్రస్తుత పరిస్థితికి అనునయించుకోవచ్చు. ఒక వస్తువు సప్లై ఎక్కువయినప్పుడు డిమాండ్ తక్కువగా ఉంటుంది. తద్వారా ఆ వస్తువు యొక్క ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకు రెండేసివెర్ మరియు ఆక్సిజన్ రెండింటి విషయంలో దేశం అంతా వీటి అవసరం ఉంది అన్నప్పుడు మాత్రం ఇవి దొరకలేదు. దేశంలో కరోనా వైరస్ వలన రోజూ వేలమంది మరణిస్తున్నారు. లక్షల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇటువంటి సమయంలో కొంతలో కొంత కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు అందించే రెండేసివెర్ ఇంజక్షన్ ల విషయంలో సంతృప్తికరమైన వార్త వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లోనూ రెండేసివెర్ ఇంజక్షన్ అందుబాటులో ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ముందుగా రెండేసివెర్ ఇంజక్షన్  లను రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంచగా, వీటిని బ్లాక్ లలో విచ్చలవిడిగా అమ్ముకున్నారు. తద్వారా అందరికీ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం డైరెక్టుగా మెడికల్ కంపెనీ లనుండి రెండేసివెర్ ఇంజక్షన్ లను తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడం ప్రారంభించింది. దీనితో చాలా వరకు రెండేసివెర్ ఇంజక్షన్ లు అన్ని హాస్పిటల్స్ లో అందుబాటులోని ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఎక్కడైనా హాస్పిటల్స్ లో అవసరం ఉండి దొరకని పరిస్థితుల్లో, వెంటనే 104 నెంబర్ కు ఫోన్ చేస్తే వాళ్ళే పంపుతారు. లేదా ఆన్లైన్ ద్వారా హాస్పిటల్ నుండి రిక్వెస్ట్ పెట్టుకున్నా పంపుతారు. ఈ ఇంజక్షన్ ధర కూడా రెండు రకాలుగా రోగులకు అందుబాటులోని ఉంది.

ఆరోగ్య శ్రీ కింద అయితే 2500 రూపాయలకు దొరుకుతుంది. లేదు ఎటువంటి హెల్త్ కార్డు లేని వారికి 1000 రూపాయలు అదనంగా 3500  రూపాయలకు దొరుకుతోంది. ఈ రెండేసివెర్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకోసారి కేంద్ర ప్రభుత్వం  అన్ని రాష్ట్రాలకు రెండేసివెర్ ఇంజక్షన్ లను పంపింది. ఉత్పత్తిని పెంచిన కారణంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 76 లక్షల రెండేసివెర్ ఇంజక్షన్ లను 21 ఏప్రిల్ నుండి 23 మే  వరకు సరిపోయేలాగా కేటాయించినట్లుగా కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం రెండేసివెర్ ఇంజక్షన్ ల కొరత తగ్గిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: