దేశంలో ఓవైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో దేశ ప్రజానీకం మొత్తం ఈ వైరస్ పేరెత్తితే చాలు ప్రాణ భయంతో వణికిపోతుంది. అంతే కాదు దేశంలో ఇక సామాన్య ప్రజల జీవితం రోజురోజుకీ అద్వానంగా మారిపోతుంది. కరోనా వైరస్ కారణంగా సరైన ఉపాధి లేక..  కుటుంబ పోషణ కూడా ఎంతగానో భారమై పోతుంది. కనీసం నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడం కూడా కష్టం గా మారిపోతుంది.  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అటు రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరుగుతుండడం అందరిని మరింత బెంబేలెత్తిస్తోంది.



 ఇప్పటికే సరైన ఉపాధి లేక ఇక ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్న పేద మధ్యతరగతి ప్రజలు ఇక ఇప్పుడు నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరిగి పోతుండటంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటివరకు సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించాయి.  దీంతో పేద మధ్యతరగతి ప్రజలు అందరూ కాస్త ఉపశమనం పొందారు. కానీ అంతలోనే మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉండడం మాత్రం అందరినీ బెంబేలెత్తిస్తోంది.




 అయితే ఎన్నికల ముందు వరకు పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తే మాకు పెట్రోల్ ధరలకు సంబంధం లేదు.. రాష్ట్ర ప్రభుత్వాలకే సంబంధం అంటూ కేంద్రం పెద్దలు సమాధానం చెప్పారు.  కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం పెట్రోల్ ధరలు పెరుగుదల ఆగిపోవడమే కాదు కాస్త తగ్గాయి కూడా.  ఇటీవల ఎన్నికలు పూర్తి కావడంతో మళ్లీ పెట్రోల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలే లీటరు పెట్రోల్ పై 24 పైసలు పెరిగింది. డీజిల్ పై 30 పైసల పెరిగింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.25 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ 90. 70 పైసలు ఉంది.  ఇలా ప్రభుత్వాలు  కష్ట సమయంలో కూడా ప్రజలను దోచుకుంటున్నాయి అని విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: