ప్రస్తుతం ప్రతి దేశంలో కూడా హాకర్ల బెడదా రోజురోజుకు పెరిగిపోతోంది.  ఇక హాకర్లు ఎప్పుడూ ప్రభుత్వాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని హాకర్లు దొంగలించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే సాధారణ దేశాల్లోనే కాదు ఇక అత్యంత అధునాతన టెక్నాలజీ ఉన్న అగ్రరాజ్యానికి కూడా ఈ హాకర్ల బెడద తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు రక్షణ వ్యవస్థ పై దాడి చేసి పలు కీలక సమాచారాన్ని దొంగిలించేందుకు హ్యాకర్లు ప్రయత్నించిన ఘటనలు కూడా తెరమీదకు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో సారి అమెరికాలో హ్యాకర్లు రెచ్చిపోయారు.



 ఎంతో అద్భుతమైన టెక్నాలజీ  ఉండి సర్వ శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాలో హాకర్లు ఎటాక్ చేయడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  తాడి తన్నే వాడు ఒక్కడుంటే వాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడు అన్న సామెతకు ప్రస్తుతం జరిగిన ఘటన నిదర్శనం గా మారిపోయింది. ర్యాండమ్ సంస్థకు చెందిన కాలోనియల్ పైప్ లైన్ పై హ్యాకర్ల దాడి చేశారు. దాదాపు కొన్ని గంటల పాటు హ్యాకింగ్ కొనసాగించారు.  ఇక ఈ హ్యాకర్లు బారి నుండి నుంచి తమ సమాచారాన్ని రక్షించుకోవడానికి అక్కడున్న వారందరూ ఎంతగానో శ్రమించారు.



 చివరికి హాకర్లు సరికొత్త డిమాండ్ తెరమీదికి తెచ్చారు. మీ రక్షణ వ్యవస్థ సరిగా లేదని.. రక్షణ వ్యవస్థలోని లోపాలను మేము చూపగలిగామని  తమ ప్రతిభకు మెచ్చి ఐదు మిలియన్ల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో.. చివరికి 5 మిలియన్ డాలర్లను ర్యాండమ్ కంపెనీ చెల్లించింది.  చివరికి ఇక ఈ డబ్బులు చెల్లించిన తర్వాత హ్యాకర్లు తమ హ్యాకింగ్ నూ ఆపినట్లు తెలుస్తోంది. తర్వాత పరిస్థితులు యథావిధిగా కొనసాగాయి. ఇలా ఇటీవలే అమెరికాలో నెలకొన్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: