జనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన ముందుకు వెళ్ళి అంశానికి సంబంధించి త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి పెద్ద గా మాట్లాడే ప్రయత్నం చేయడంలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో పార్టీ నేతల్లో చాలా వరకు కూడా ఇబ్బందికర అభిప్రాయాలున్నాయి.

 భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని అందుకే ఆయన మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీ అన్ని అంశాలలో కూడా వెనక్కు లాగుతూనే ఉంది. కాబట్టి ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం వల్ల నష్ట పోవడమే గానీ పెద్దగా పవన్ కళ్యాణ్ లాభపడేది అంటూ ఏమీ లేదు అనే విషయం చెప్పవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో అదే విధంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీని చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే.

కాబట్టి ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం వల్ల జనసేన పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు నిరసన కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీతో కలిసి చేయడంకంటే కూడా జనసేన పార్టీ సొంతంగా చేస్తే మంచిదని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళితే మంచి ప్రయోజనం ఉంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భారతీయ జనతా పార్టీని పూర్తిగా పక్కన పెట్టకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పరువు కూడా పోయింది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: