ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో కి వెళ్లి పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది పనులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనే మాట వాస్తవం. ఇక ఆర్థికంగా కూడా చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్లకు అవసరమైతే ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది.

అంతే కాకుండా వారి ఆహార అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉంది. కానీ వైసీపీ ఎమ్మెల్యే లు పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా సైలెంట్ గా ఉంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ వద్దకు కనీసం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం లేదు అని వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అయినా సరే వైసీపీ ఎమ్మెల్యే లు సైలెంట్ గా ఉండడం పట్ల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యేల కారణంగా సీఎం కేసీఆర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకులు పెద్దగా కనపడక పోవటంతో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కూడా ఎమ్మెల్యే లకు సంబంధించి ఆరా తీస్తున్నారని ఎవరు పనిచేస్తున్నారు... ఎవరు పని చేయడం లేదు అనే అంశాలను ఆయన స్వయంగా తెలుసుకుంటున్నారు. పార్టీ కీలక నేతల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: