ద్విచక్ర వాహన దారులు తప్పక హెల్మెట్ వాడాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాల మీద ఆశ ఉన్న వాళ్ళు మాత్రం వాడుతున్నారు.. మిగిలిన వాళ్ళు గాలికి వదిలేశారు. మహా అయితే ఫైన్ కడతాను అని మొండిగా వ్యవహరిస్తున్నారు.. అలాంటి రక్షణ హెల్మెట్ కరోనా సమయంలో పనికొస్తుంది.. ఎండవేడిమి నుంచి కరోనా వైరస్ నుంచి రక్షిస్తుంది. ఇది ఇలా ఉండగా హెల్మెట్ తో ఓ పూజారి చేసిన పనికి అందరూ నోర్లు వెళ్ళబెట్టారు.. ఆయన ద్విచక్ర వాహనం పైన మాత్రమె కాదు వృత్తిలో కూడా హెల్మెట్ ను మాములుగా వాడలేదు. ఎక్కడ పూజలు జరిగిన కూడా ఆయన హెల్మెట్ తో వెళ్ళడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది..

మరి కొందరేమో ఇదేం పిచ్చి అని నవ్వుకున్నారు.. అయినా ఆయన మాత్రం ఆ హెల్మెట్ లేకుండా బయటకు రావడం లేదు. వివరాల్లోకి వెళితే..ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఓ పూజారి వాహనం నడిపేటప్పుడే కాదు, వృత్తి ధర్నాన్ని నిర్వర్తించేటపుడు కూడా హెల్మెట్‌ను వీడటం లేదు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్య డబుల్ మాస్కులు ధరిస్తున్నారు. మరికొందరు ఎక్కడికి వెళ్ళినా శానిటైజర్ ను వెంటా తీసుకెళుతూ తరుచు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటున్నారు.

స్థానికంగా షాప్ ఓపెనింగ్ చేయించడానికి వచ్చిన ఓ పూజారి మాత్రం ఏకంగా హెల్మెట్ పెట్టుకొని పూజలు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.మొదట అందరూ నవ్వుకున్నా తర్వాత కరోనా నేపథ్యంలో ఇంత శ్రద్దగా జాగ్రత్తలు తీసుకోవడం చూసి బాగుందని మెచ్చుకుంటున్నారు. కాగా వేగంగా విస్తర్తిస్తున్న కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇపుడు లాక్ డౌన్ అమలు చేస్తోంది. కానీ బోథ్ మండల కేంద్రంలోఅంతకు ముందు నుంచే స్వచ్చందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు గ్రామస్తులు.. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు తెలుపుతున్నారు.ఎక్కడకు వెళ్ళినా కూడా మాస్క్, శానిటైజర్ ను తప్పక వాడాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: