దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి. ఇది ఉద్యోగులకు కొంత సౌకర్యంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇబ్బందులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు ఇచ్చినప్పటికీ ఎంత పని జరిగిందనే విషయమై సంస్థలు లెక్కలేసుకుంటాయి. ఇచ్చిన టైంలో పని పూర్తి కాకపోతే పై నుంచి ఒత్తిడి మామూలుగా ఉండదు. ఆఫీసుల్లో అయితే పని చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. అదే ఇంటి దగ్గర నుంచి చేస్తే కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి చిన్నపాటి ఆటంకాలు ఏర్పటడం సహజమే. అంతేకాకుండా ఒకే చోట అలా కూర్చొని పని చేయడం వల్ల తొందరగా అలసిపోతారు. ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది. మరోవైపు ఎక్కువ సేపు పనిచేయడం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని, ఆ మరణాలని కరోనా ఇంకా అధికం చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసింది. జర్నల్ ఇన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రకారం 2016లో 7,45,000మంది మరణించారు.

ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల వచ్చిన గుండె సంబంధిత వ్యాధులే దీనికి కారణం అని తెలిపారు. 2000సంవత్సరం నుండి పోలిస్తే ఇది 30శాతం పెరిగినట్లుగా ఉంది. ఒక వారంలో 55గంటల కంటే ఎక్కువ పనిచేయడం ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన వాతావరణ, ఆరోగ్య డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జ్ మారియా నెయిరా తెలిపింది. పనిచేసే వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆమె తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా ఇచ్చిన సమాచారం ప్రకారం మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది పురుషులే ఉంటున్నారు. ఇంకా మధ్యవయస్కులు, వృద్ధులు ఉంటున్నారు. కొన్నిసార్లు ఈ మరణాలు చాలా రోజుల తర్వాత సంభవిస్తున్నాయని, పని చేసిన పదేళ్ళకు దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: