దాదాపుగా నెల రోజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న వైఖరిపై దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి కనీసం ప్రజలతో కూడా మాట్లాడటం లేదు. కనీసం ముఖ్యమంత్రులతో కూడా ఆయన సమర్థవంతంగా మాట్లాడటం లేదు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని అన్ని వర్గాలు గట్టిగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియా తో మాట్లాడాలి.

అయితే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ విషయంలో ముఖ్యమంత్రులు సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. కొంతమంది ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి విషయంలో కాస్త ఆగ్రహంగా ఉన్నారు అనే వార్తలు మనం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా కేరళ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ విషయంలో సీరియస్ గా ఉన్నారు అనే వార్తలు వినపడుతున్నాయి.

అంతేకాకుండా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి మోడీ విషయంలో సీరియస్ గా ఉన్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తమను ఇబ్బంది పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నా మోడీ కనీసం రాష్ట్రంలో ప్రజల కష్టాలు పడుతున్న సరే కానీ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని ఆగ్రహం ఉంది. కేంద్ర ప్రభుత్వం అసలు ఏమాత్రం కూడా స్పందించడం లేదు అనే ఆవేదన వారిలో ఎక్కువగా వ్యక్తమవుతుంది. రాజకీయ లక్ష్యాలు మాత్రమే దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి మోడీని ఎదుర్కోవడానికి త్వరలోనే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో సమావేశం నిర్వహించి అవకాశం ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ లకు ఆహ్వానం వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: