దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కేసులు ఆకాశాన్ని తాకుతున్నాయి.రోజుకి 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చాప కింద నీరు లాగా కరోనా దేశంలో నలుమూలాల వ్యాప్తి చెందుతుంది. ఇక ఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది. పట్టణాలలో కేసులు చాలా ఎక్కువవుతున్నాయి.ఇక పట్టణాలతోపాటు ఇప్పుడు గ్రామాలలోనూ కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కరోనా మహమ్మారి పాజిటివిటీ రేటు 30 శాతం కంటే ఎక్కువగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా, కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి,ఆరోగ్య సౌకర్యాలను మరింతగా మెరుగుపర్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


ఇక ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కంటైన్మెంట్ జోన్లు, నిర్వహణతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెట్టాలని సూచించడం జరిగింది.ర్యాపిడ్ పరీక్షలపై ఏఎన్ఎం, సీహెచ్వోలకు శిక్షణ ఇవ్వాలని, అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లోనూ కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందించాలని తెలిపింది.


ఇక కరోనా మహమ్మారి సోకిన వారి కేసుల సంఖ్య, వైరస్ తీవ్రతను బట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పనిసరిగా చేయాలని తెలిపింది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్ల ద్వారా స్థానిక సేవలను విస్తృతం చేయాలని తెలిపింది.ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. కరోనా లక్షణాలున్నవారికి ప్రాథమిక వైద్య సిబ్బందితో టెలిమెడిసిన్ వైద్య సేవలందించాలన్నారు. కరోనా సోకినవారిలో ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లయితే వారిని జనరల్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. కరోనా బారిన పడ్డవారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: