తెలంగాణలో రాజకీయంగా ఈటెల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈటెల రాజేంద్ర అడుగులు వేస్తారు ఏంటనే దానిపై అందరు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రాజేంద్ర విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. అయితే ఈటెల రాజేందర్ కు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే ఈటెల రాజేందర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ పార్టీని వదిలి బయటకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది.

టిఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేదని కొంతమంది ఇప్పుడు పార్టీ మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈటెల రాజేందర్ తో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీలో ఉంటున్న సరే వారు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఇక పార్టీలో తనకు ప్రాధాన్యత లేకపోవడం అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఇబ్బంది పెట్టడంతో ఈటెల పార్టీలో ఉండడానికి ఎంతమాత్రం కూడా సిద్ధంగా కనబడటంలేదు.

ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారేందుకు ఆసక్తికరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఇంతలో ముఖ్యమంత్రి ఆయన విషయంలో మంత్రి పదవి నుంచి తొలగించడం అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వంటివి కూడా జరిగాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఒకవేళ ఈటెల రాజేందర్ పార్టీ మారితే ఏం చేయాలి ఏంటి అనే దానిపై అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: