ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ)లో సభ్యుడిగా ఉన్న సీనియర్ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తన బాధ్యత నుంచి తప్పుకొని షాక్ ఇచ్చారు. కరోనా వైరస్‌కు చెందిన వివిధ రకాల వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ సలహా బృందం ఏర్పాటు చేయగా అందులో సభ్యులుగా ఉన్న సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్‌ ఇప్పుడు ఆ పోస్ట్ కి రాజీనామా చేశారు. ఇటీవలే దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పట్ల కేంద్రం వైఖరిని ఎత్తి చూపిన ఆయన వైరస్ వ్యాప్తి తీవ్రత గురించి ముందే హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, శాస్త్రవేత్తల ఆధారపూరిత అంచనాలకు ఇక్కడే విలువే లేకుండా పోయిందని పేర్కొన్న కొద్ది రోజులకే ఇలా రాజీనామా చేసి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం సంచలనాత్మకంగా మారింది. దీని గురించి ఆయన మాట్లాడుతూ నేను కరెక్ట్ డెసిషన్ ని తీసుకున్నాను.

దీని గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదు అలాగే నా రాజీనామాకు కారణాలు చెప్పాలి అనుకోవడం లేదు అంటూ రాయిటర్స్ వార్తా సంస్థకు  తెలిపారు షాహిద్ .ఈ విషయంపై ఇదే శాఖలో పలువురికి తెలిసినా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ భారత ప్రభుత్వ శాస్త్రవేత్తలకు మద్దతుగా ఉండడం లేదు అన్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది. దీనికి నిదర్శనంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రెటరీ రేణూ స్వరూప్ ఈ విషయంపై ఏమీ మాట్లాడలేదు.  జమీల్ మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు అధికారుల నుండి సరైన సహకారం పొందలేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం భారత్ లోని ప్రస్తుత పరిస్థితుల గురించి న్యూయార్క్ టైమ్స్ కి రాసిన ఒక ఆర్టికల్ లో కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. దేశం పూర్తిగా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విఫలమయింది.

ముఖ్యంగా కరోనా పరీక్షలు అతి తక్కువగా చేస్తుండడం, వ్యాక్సినేషన్ ఇంకా అందరికీ ఇవ్వకపోవడం, వ్యాక్సిన్ ఉత్పత్తిలో లోపాలు మరియు వ్యాక్సిన్ కొరత పట్ల ముందు చూపు లేకపోవడం వంటి పలు అంశాలను కారణాలుగా చెప్పారు. కానీ వీటన్నింటి పై మా శాస్త్రవేత్తల బృందానికి ఒక విశేషమైన అవగాహన మరియు మద్దతు ఉంది. కానీ అధికారుల నుండి మద్దతు కరువైందని పరోక్షంగా కేంద్రాన్ని విమర్శించారు. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన సమచారాన్ని పొందడంలో ఎటువంటి పొరపాట్లు కానీ మరియు ఆలస్యం కానీ జరగకూడదు అన్నారు. ఈ అంశంపై గత నెలలోనే 800 మంది శాస్త్రవేత్తలు ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారని పేర్కొన్నారు. ఇలా పలు విషయాలను డాక్టర్ జమీల్ పంచుకున్నారు. దీనిపైన కేంద్రం ఏమైనా స్పందిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: