కొవిడ్-19 మహమ్మారి కారణంగా నెమ్మ‌దించిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌ట్టాలెక్కించేందుకు ఎక్కువ ప‌నిగంట‌లు ఉండాల‌ని చాలా కంపెనీలు భావిస్తుండ‌టం ప్ర‌మాద‌క‌ర‌మైన ధోర‌ణి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఎక్కువ ప‌నిగంట‌ల‌వ‌ల్ల కలిగే నష్టాలపై  డబ్ల్యూహెచ్ఓ, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రపంచంలో తొలిసారిగా సంయుక్త అధ్యయనం చేప‌ట్టాయి. ఈ ఫలితాలను ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ నివేదిక ప్రకారం.. 2016లో గుండె పోటు, హృదయ సంబంధిత వ్యాధులతో 7,45,000 మంది గుండెపోటు, ఇత‌ర హృద‌య సంబంధ వ్యాధుల‌తో ప్రాణాలు కోల్పోయారు.

194 దేశాల్లో అధ్య‌య‌నం
మొత్తం 194 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. వారానికి 35 నుంచి 40 గంటలు పనిచేసేవారితో పోల్చితే 55 లేదా అంత కంటే ఎక్కువ గంటలు పనిచేసేవారిలో 35 శాతం అధికంగా గుండెపోటు ముప్పు, 17 శాతం అధికంగా హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2000-2016 మధ్య కాలాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.. అని డబ్ల్యూహెచ్ఓ పర్యావరణ, వాతావరణ మార్పులు-ఆరోగ్య విభాగం డైరెక్టర్ మారియా నీరా పేర్కొన్నారు. ఈ అధ్య‌య‌నంవ‌ల్ల కార్మికులకు మరింత రక్షణ కల్పించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు. ఎక్కువ ప‌నిగంట‌ల‌వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌వారిలో 72 శాతం మంది మధ్య వయస్కులు లేదా వృద్ధులే ఉన్నారు. చైనా, జపాన్, ఆస్ట్రేలియా సహా ఆగ్నేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో దీని ప్ర‌భావం ఎక్కువ‌గా క‌న‌ప‌డింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.

ప‌నిగంట‌లు పెంచ‌క‌పోవ‌డ‌మే స‌రైన నిర్ణ‌యం!
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ‌నామ్ ఘ్యాబ్రియేసిస్‌ సహా సిబ్బింది మహమ్మారి సమయంలో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని నీరా వెల్ల‌డించారు. ఎక్కువ ప‌నిగంట‌లు ఉత్పాదకతను పెంచుతాయ‌ని స‌ర్వేలో తేల‌డంతో యాజమాన్యానికి ప్రయోజనం కలుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక అధికారి ఫ్రాంక్ పెగా చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెల‌కొన్న త‌రుణంలో ప‌నిగంట‌లు పెంచ‌కూడ‌దు అనే నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మైన‌ద‌ని ఫ్రాంక్‌పెగా అభిప్రాయ‌ప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: