ఏపీలో ఓప‌క్క కోవిడ్ విజృంభిస్తుండ‌గా.. అదే క్ర‌మంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. అధికార పార్టీ వైసీపీ వ్యూహాల‌కు టీడీపీ నేత‌లు బోల్తాప‌డుతున్నార‌న్న ప్ర‌చారం సాగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో 150కిపైగా అసెంబ్లీ స్థానాల్లో పాగావేసిన వైసీపీ.. ప్ర‌స్తుతం సైతం అదే దూకుడును కొన‌సాగిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. టీడీపీకి ప‌ట్టున్న ప్రాంతాల‌పై దృష్టిసారించిన వైసీపీ నేత‌లు పూర్తిస్థాయిలో టీడీపీని నిర్వీర్యం చేసేలా పావులు క‌దుపుతున్నారు. గ్రామ‌, మండ‌ల‌, జిల్లాల స్థాయిల్లో గురిపెట్టి వైసీపీని బ‌లోపేతం చేసే ప‌నిలో ఆ పార్టీ నేత‌లు సైలెంట్‌గా ముందుకెళ్తున్నారు. టీడీపీ నేత‌లు మాత్రం త‌మ‌కు ప‌ట్టున్న స్థానాల్లోనూ క్యాడ‌ర్‌ను కాపాడుకొనే ప‌రిస్థితి చేయ‌డం లేద‌న్న చ‌ర్చ‌సాగుతుంది.

ఏపీలో టీడీపీ కంచుకోట‌లుగా ఉన్న జిల్లాల్లో వైసీపీ పాగా వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీకి గ‌ట్టిప‌ట్టు ఉండేది.  పార్టీ ఓటు బ్యాంకుతో పాటు, అభిమానులు, టీడీపీ శ్రేయేభిలాషులు భారీ సంఖ్య‌లో ఆ జిల్లాల్లో ఉండేవారు. కానీ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జిల్లాల‌కు జిల్లాల‌ను వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. టీడీపీకి కంచుకోట‌ల‌నుసైతం ఆపార్టీ బ‌ద్ద‌లు కొట్టింది. ఎన్నిక‌ల త‌రువాతకూడా ఆయా జిల్లాల్లో మ‌రింత బ‌లోపేతం అయ్యేలా వైసీపీ ప‌క్కా వ్యూహంతో ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీకి ప‌ట్టున్న జిల్లాల్లోనూ వైసీపీ బ‌ల‌మైన పార్టీగా ఎదిగిపోతుంది. ఆ పార్టీ నాయ‌కులుసైతం దూకుడుగా ముందుకెళ్తున్నారు.

వైసీపీ ఈ స్థాయిలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటే టీడీపీ నేత‌లు మాత్రం ఢీలా ప‌డిపోతున్నార‌ట‌. క‌నీసం టీడీపీకి గ‌ట్టిప‌ట్టున్న ప్రాంతాల‌నుసైతం ఆ పార్టీ నేత‌లు కాపాడుకోలేక పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తుంది. ఆయా జిల్లాల్లోని టీడీపీ నేత‌లు అధికార పార్టీ నేత‌లు పెట్టే కేసుల‌కు భ‌య‌ప‌డి ప్ర‌జ‌ల్లోకి పెద్ద‌గా రావ‌డం లేద‌న్న చ‌ర్చ సాగుతుంది. దీంతో క్యాడ‌ర్‌లో సైతం ఉత్సాహం క‌ర‌వైంద‌న్న ప్ర‌చారం సాగుతుంది. రాజ‌కీయాల‌న్న త‌రువాత పంతాలు, ప‌ట్టింపులు ఉంటాయి. అలాంటిది వైసీపీ నేత‌లు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ టీడీపీ కంచుకోట‌ల్లో పాగావేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. త‌మ‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను కాపాడుకొనే దోర‌ణి టీడీపీ నేత‌ల్లో క‌రువైందట‌. ముఖ్యంగా నెల్లూరు, ప్ర‌కాశం, సీమ జిల్లాల్లో వైసీపీ పూర్తిగా ప‌ట్టు సాధించింది. ప్ర‌స్తుతం టీడీపీ అధినేత చంద్ర‌బాబు జిల్లాలో వైసీపీ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అన్ని జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించేలా వైసీపీ ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. మ‌రి వైసీపీ వ్యూహాల‌ను టీడీపీ ఏ విధంగా ఎదుర్కోగ‌ల‌ద‌న్న చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: