రాష్ట్రంలో ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం ఆదేశించారు అని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానీ వివరించారు. ఇప్పటి వరకు ఉన్న సమయ వేళల్లోనే కర్ఫ్యూ అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అని ఆయన తెలిపారు. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు అని అన్నారు.

బ్లాక్ ఫంగస్ సోకిన వారికి  ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స  చేయాలని సీఎం ఆదేశించారు  అని ఆయన పేర్కొన్నారు. పాజిటివ్ పేషంట్ల గుర్తింపుకోసం ఫీవర్ సర్వే చేస్తున్నాం  అని ఆయన మీడియాకు వివరించారు.  గ్రామీణ ప్రాంతాల్లో మరింత  పకడ్బంధీగా ఫీవర్ సర్వే  నిర్వహిస్తున్నాం  అని తెలిపారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తాం  అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కోవిడ్ కారణంగా  తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాధలు అయితే  వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది  అని అన్నారు.

పదివేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లకు టెండర్లు పిలిచాం  అని అన్నారు. ఈనెలాఖరు కల్లా  2వేల పైగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ రాబోతున్నాయి అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు  9 బ్లాక్ ఫంగస్  కేసులు నమోదయ్యాయి అని ఆయన వివరించారు. బ్లాక్ ఫంగస్ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు అని తెలిపారు. బ్లాక్ ఫంగస్ నివారణకు వాడే మందులను సమకూర్చాలని సీఎం ఆదేశించారు అన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం ఆదేశించారు అని వివరించారు. కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: