ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్క రోజే 24 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నేపధ్యంలో కాస్త కరోనా విషయంలో ఏపీ సర్కార్ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. ఇక ఏపీ ప్రభుత్వం కరోనా చర్యలకు సంబంధించి కర్ఫ్యూని ఈ నెల చివరి వరకు పెంచుతూ నేడు ఉదయం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా కోవిడ్ పరిస్థితులు ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది.

అఖిల భారత న్యాయవాదుల సంఘం, APCLA, తోట సురేష్ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్ట్ విచారణ జరిపింది. ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం, ఆక్సిజన్ బెడ్లు అందుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు  ఏంటీ అని ఏపీ హైకోర్ట్ ప్రశ్నించింది. అందరికీ వ్యాక్సినేషన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు అడిగి తెలుసుకున్న న్యాయస్థానం... రెమిడెసివర్ తో పాటు అత్యవసర మందుల లభ్యత గురించి ఆరా తీసింది. సీనియర్ సిటీజన్స్, కోవిడ్ రోగులకు ఇళ్ల వద్ద వ్యాక్సిన్ పై కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నలు వేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే వీటిపై ఏం చర్యలు తీసుకున్నారో ఈ నెల 19కి నాటికి కోర్టుకి తెలపాలని ఆదేశాలు ఇచ్చింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రుల్లో బెడ్ల లభ్యత అదే విధంగా  ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని కోవిడ్ చికిత్స అందించటంపై కోర్టుకి అన్ని వివరాలతో అఫిడవిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలిత్ కుమారి బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తడుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది కోర్ట్. ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రుల్లో బాధితుల రోజువారీ సమాచారం బాధితుల బంధువులకు అందించాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: