తెలంగాణా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు హాజరు అయ్యారు. లాక్ డౌన్, కరోనా నిబంధనల అమలుపై నివేదికను డీజీపీ  సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 98 కేసులు నమోదు చేసామని ఈ సందర్భంగా డీజీపీ వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటు చేసామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.

ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు అయ్యాయి అని ఆయన తెలిపారు. మాస్కులు ధరించనందుకు 3,39,412 కేసులు నమోదు చేసామని రూ.31కోట్ల జరిమానా విధించామని తెలిపారు. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేసామని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు చేసామని వివరించారు. లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల పనితీరు అభినందనీయం అని ఈ సందర్భంగా కొనియాడింది.

పోలీసులు ఇదే విధంగా పని చేయాలి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక విచారణ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్ లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కార్పొరేషన్ లు ఎన్ జీఓ లతో ఒప్పందం చేసుకుని  కమ్యూనిటీ కిచన్ లు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి అని పేర్కొంది. ప్రతి జిల్లా వెబ్ సైట్ లో కమ్యూనిటీ కిచన్ వివరాలు పొందపరచాలి అని వివరించింది.

వాక్సినేషన్ కు సంబందించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం కు హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ సిటిజన్ లు, పేద వారికి వాక్సినేషన్ కోసం ఎన్ జి వో లతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వాక్సినేషన్ పెట్టండి అని పేర్కొంది. ఎలక్షన్ డ్యూటీ లో ఉండి 500 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారు 15 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు అని పిటిషనర్ తెలిపారు. ఎలక్షన్ డ్యూటీ లో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్ వారియర్లు గా గుర్తించాలి అని ఆదేశించింది. వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం అందించాలి అని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: