జగన్ ఇంట్లోనూ ఒంట్లోనూ రాజకీయం ఉంది. ఆయన తండ్రి వైఎస్సార్ రాజకీయాన్ని పుణికి పుచుకున్నారు. ఇక సహజంగానే జగన్ కి రాజకీయ కోరిక కలిగి 2009 ఎన్నికల్లో పోటీ చేసి కడప నుంచి ఎంపీ అయ్యారు. వైఎస్సార్ అనూహ్య మరణం తరువాత జగన్ కొత్త పార్టీ పెట్టి ఏకంగా ఏపీలోనే నంబర్ వన్ పొలిటీషియన్ అయ్యారు.

జగన్ ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉంటూ రాజకీయంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఇక జగన్ విపక్షంలో ఉన్నపుడే 23 మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. నాడు ముగ్గురు ఎంపీలు కూడా జగన్ కి గుడ్ బై చెప్పారు. సరే నాడు జగన్ అధికారంలో లేరు కాబట్టి అలా జరిగింది అనుకోవచ్చు. కానీ ఇపుడు జగన్ పవర్ లో ఉన్నారు. అయినా సరే సొంత పార్టీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు. ఆయనకు అధికారంలో ఉన్న పార్టీ కంటే విపక్షం జట్టు ఎందుకు నచ్చింది. అక్కడ ఏమి ఆకర్షణ ఉంది. ఇవన్నీ చర్చించదగిన విషయాలే.

ఇదిలా ఉంటే నిజానికి మొదట్లో  రఘురామకు జగన్ కి పెద్దగా గొడవలు లేవు. ఒక విధంగా చూస్తే ఇగోస్ మీద వచ్చిన విభేదాలుగా వీటిని చూడాలి. రాజుకు అన్నిటా  తానే పెద్ద అనిపించుకోవాలని ఉండేది. జగన్ ఈ విషయంలో అందరికీ ఒకేలా చూశారు. ఇక రాజు లో కొంత అసంతృప్తి మొదట్లో ఉండేది. ఆయన రూట్ మారుతోంది అని తెలిసిన నాడే పిలిచి చర్చించి ఉంటే ఇంతదాక కధ రాదు అన్న వారు ఉన్నారు. పార్టీ అన్నాక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందువల్ల  అధినేతలు ఆయన నేతలతో మాట్లాడితే అవన్నీ సర్దుకుంటాయి. అయితే జగన్ ఈ విషయంలో కొంత లేట్ చేశారు అన్న మాట ఉంది. ఇక రాజు ధిక్కార స్వరం వినిపించిన నాడే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించి ఉంటే కచ్చితంగా పెద్ద తలనొప్పి తప్పేది అని కూడా ఉంది. మొత్తానికి ఇపుడు ఇంత రచ్చ జరుగుతోంది. దీని ఫలితాలు ఎవరికి అనుకూలం అంటే చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా ప్రభుత్వాధినేతగా పార్టీ అధినేతగా ఉన్న జగన్ మీదనే అందరి కళ్ళూ ఉంటాయి కాబట్టి ఆయన కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాల్సింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: