జగన్ దెబ్బకు ఏపీలో టీడీపీ పరిస్తితి చాలా ఘోరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతిచోటా టీడీపీ వీక్‌గా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అసలు 2019 ఎన్నికల తర్వాత చాలామంది టీడీపీ నాయకులు సైడ్ అయిపోయారు. పలువురు నేతలు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇంకొందరు వైసీపీ ప్రభుత్వం పెట్టే కేసులు దెబ్బకు అడ్రెస్ ఉండటం లేదు.


దీంతో జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకుడే కరువైపోయాడు. చిత్తూరు, గంగాధరనెల్లూరు, పుంగనూరు, పూతలపట్టు, తంబళ్ళపల్లె, మదనపల్లె, సత్యవేడు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం చాలా వీక్‌గా ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అడ్రెస్ లేదు. చిత్తూరు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన మనోహర్ పార్టీకి దూరంగా ఉన్నారు. గంగాధరనెల్లూరులో హరికృష్ణ అడ్రెస్ లేరు.


పూతలపట్టులో ఓడిపోయిన లలితకుమారి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి హవా ఉండే పుంగనూరులో టీడీపీ నాయకురాలు అనీషారెడ్డి సైలెంట్‌గా ఉన్నారు. మదనపల్లెలో ఓడిన దొమ్మాలపాటి రమేష్ పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. తంబళ్ళపల్లెలో శంకర్ యాదవ్ యాక్టివ్‌గా లేరు. సత్యవేడులో కూడా అదే పరిస్తితి. ఇక చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ చనిపోయాక, చిత్తూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. శివప్రసాద్ టీడీపీ తరుపున రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 


అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయాక అనారోగ్యం పాలయ్యి, మరణించారు. ఇక ఆయన స్థానాన్ని మరో నాయకుడుతో భర్తీ చేయలేదు. ఇటు ఇటీవల తిరుపతి ఉపఎన్నికలో పనబాక లక్ష్మీ ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక పనబాక కంటికి కనిపించడం లేదు. ఇక మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లోనే ఆమె పార్టీలో కనిపించే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే బాబు సొంత జిల్లాలోనే సైకిల్ తోక్కేవాళ్లు లేకుండా పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: