ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్తున్న అంబులెన్స్ లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు పోతున్నా సరే ఈ విధంగా ఏవిధంగా వ్యవహరిస్తారు అంటూ పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో ఉన్న విపక్షాలు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విపక్షాలు అన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేస్తూ ఆరోపణలు చేశాయి.

ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా విపక్షాలను టార్గెట్  గా  చేసుకుని గతంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి వచ్చేయడం వల్లనే ఇప్పుడు మనకు తెలంగాణ రాజధాని హైదరాబాదును వాడుకునే అవకాశం లేకపోయింది అంటూ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా  చేసుకుని ఈ అంశంలో ఆరోపణలు చేశారు.

కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇచ్చినా సరే అవి సమర్థవంతంగా ముందు అమలు కాలేదు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఎప్పటికో తర్వాత దాన్ని అధికారులు అమలు చేశారు. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు విమర్శలు చేయలేదు. దీని ఆధారంగా చూస్తే సీఎం కేసీఆర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. కేసీఆర్ అంటే భయపడి మాత్రమే మాట్లాడలేదు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇలాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: