ఇజ్రాయిల్, పాలస్తీనాలోని హమాజ్ తీవ్రవాదుల మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా ఇజ్రాయిల్‌పై జరిగిన దాడులకు ఇజ్రాయిల్ ప్రతి దాడులు చేపట్టి ఇప్పటికే వారం దాటుతోంది. కానీ ఈ రెండిటి మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు సరికదా మరింత తీవ్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమపై జరిగిన దాడులకు ఇజ్రాయిల్ చేపట్టిన ప్రతి చర్యలు పాలస్తీనాను వణికిస్తున్నాయి. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ వెనకడుగు వేయడం లేదు. అంతేకాకుండా తన తీరును ఏమాత్రం మార్చుకోనని, తన అంతర్గత విషయాల్లో ఏ దేశం జోక్యం చేసుకోవద్దని ఇజ్రాయిల్ ప్రభుత్వం అంటోంది.


ఈ వ్యవహారంలో ఇజ్రాయిల్‌పై ప్రపంచలోని 57 దేశాలు అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఒకపక్క అంతర్జాతీయ సమాజం ఒత్తిడి, అమెరికా, ఐక్యరాజ్ర సమితి ప్రశ్నలతో పాటు అరబ్ దేశాలు వార్నింగ్ ఇస్టున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇజ్రాయిల్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతేకాకుండా ఇజ్రాయిల్‌పై జరిగిన దాడుల్లో మరణించిన భారతీయ మహిళ సౌమ్య పేరిట ఆపరేషన్ సౌమ్య అని ఓ ఆపరేషన్ చేపట్టింది. తన దేశంలోని ఓ యుధ్ద విమానానిక ఆమె పేరును పెట్టి దాని చేత పాలస్తీనాపై దాడులు చేస్తోంది. అంతేకాకుండా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆ దేశ ప్రధాని నెతన్యాహు భారత ప్రధాని మోదీకి తెలియ జేస్తున్నారు.


ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఇంకొన్ని రోజుల్లో అక్కడ ప్రతిపక్ష నేత బేనీ గేట్స్ ప్రభుత్వ ఏర్పాటుకి అక్కడి రాష్ట్రపతి ఆమోదం కూడా ఇచ్చారు. ఇంతలో ఇజ్రాయిల్‌కు, హమాజ్ ఉగ్రవాదుల మధ్య యుద్దం మొదలైంది. దాంతో బెనీగేట్స్, అతడి నేతలు ప్రధాని నెతన్యాహుకు మద్దతునిచ్చారు. అయితే బెనీగేట్స్ మాత్రం తన ప్రమాణ స్వీకారం ఇప్పుడు ముఖ్యం కాదని, దేశ రక్షణే ముఖ్యమని, యుద్దం పూర్తయిన తర్వాతే తాను పదవిని స్వీకరిస్తానని, అప్పటి వరకు నెతన్యాహూయే దేశ ప్రధాని అని అన్నారు. అంతేకాకుండా పాలస్తీనాలో ఏ ఒక్క ఉగ్రవాది కూడా ఉండకూడదని, దాడులను మరింత తీవ్రం చేయమని బెనీ గేట్స్ అన్నారు. దీంతో బెనీగేట్స్ అసలైన ప్రజా నాయకుడని ఇజ్రాయిల్ ప్రజలు అతడిని కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: