గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మద్య వార్ ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇరు దేశాలు కూడా పరస్పర దాడులకు తెగపడుతూ బాంబులను, క్షిపణులను ప్రయోగిస్తూ యుద్ద వాతావరణాన్ని సృస్టిస్తున్నాయి. పాలస్తీనా తీవ్రవాదుల దాడితో ఉలిక్కిపడిన ఇజ్రాయిల్ సైన్యం ప్రతి దాడులకు దిగడంతో ఇజ్రాయిల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. పాలస్తీనా హమాస్‌ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయిల్‌ ఆగ్రహావేశం ఏమాత్రం చల్లారడం లేదు.

రెండు దేశాల మధ్య ఘర్షణలు ప్రారంభమై దాదాపుగా వారంరోజులు కావొస్తున్న ఇప్పటి వరకు పరిస్థితులు ఏమాత్రం సద్ధుమణగలేదనే చెప్పాలి. పైగా మరింత తీవ్రమయ్యే సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్‌ వైమానిక దాడులతో గాజా వణికిపోతుండగా.. హమాస్‌ రాకెట్‌ దాడులు ఇజ్రాయిల్‌ ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గ‌త వారం రోజులుగా ఇజ్రాయిల్ సేన‌లు-హ‌మాస్ మిలిటెంట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఈ భీకరపోరు వ‌ల్ల భారీగా ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం భారీగానే జరిగింది. ఘర్షణలు ప్రారంభమైన తర్వాత గాజా చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా మిగిలిపోయింది.

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మద్య యుద్దమేఘాలు కమ్ముకోవడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇరు దేశాల మద్య సయోధ్య కుదిర్చేందుకు ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రంగంలోకి దిగి ఇరు దేశాలు శాంతించాలని కోరింది. ఈ నేపథ్యంలో పాలస్తీనా ఉగ్రదాడికి ప్రతిగా ఇజ్రాయెల్ తిరిగా దాడి చేయడంపై విచారణ చేపడతామన్నా అంతర్జాతీయ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. ఇజ్రాయెల్ మాజీ డిఫెన్స్ మినిస్టర్ నప్తాల్ బెన్నీడ్ అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని సూటిగా ప్రశ్నిస్తూ అంతర్జాతీయ న్యాయ స్థానంలో సభ్యత్వమే లేని ఇజ్రాయెల్ పై విచారణ ఎలా చేపడతారని ఘాటుగా ప్రశ్నించారు.

ఇజ్రాయెల్ దేశం స్వయం ప్రతిపత్తి రాజ్యాంగం కలిగి ఉందని, ప్రతి ఇజ్రాయెల్ పౌరుడు రాజ్యాంగ నిబందనలకు ఎప్పుడు కట్టుబడి ఉంటాడని, తీవ్ర వాదులు తమ దేశంపై దాడి చేస్తే చూస్తూ ఉరుకునేది లేదని, మాకు సూచనలివ్వడం మనుకోవాలని అంతర్జాతీయ న్యాయ స్థానానికి ఇజ్రాయెల్ మాజీ డిఫెన్స్ మినిస్టర్ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. అయితే ఇజ్రాయెల్ స్పందించిన తీరుపై విశ్లేషకులు సైతం ఏకీభవిస్తున్నారు. అగ్రరాజ్యాలు చేసే తప్పులను ప్రశ్నించని అంతర్జాతీయ న్యాయ స్థానం, అగ్రదేశాలతో సంబంధం లేని చిన్న దేశమైన ఇజ్రాయెల్ ను ప్రశ్నించడం ఏంటని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మద్య వార్ విషయంలో జోక్యం చేసుకున్న అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇజ్రాయెల్ సమాధానం చెప్పపెట్టులా మారిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: