ఇద్దరు చిన్నారులు పతంజలి బిస్కెట్లు తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడ ప్రాంతంలో జరిగింది. స్థానికంగా ఉన్న పతంజలి ఆరోగ్య కేంద్ర స్టోర్స్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓం రెడ్డి అనే వ్యక్తి పతంజలి స్టోర్‌కు వెళ్లి 10 బిస్కెట్ ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఓం రెడ్డి పిల్లలు బిస్కెట్లు తిన్నారు. అయితే బిస్కెట్లు తిన్న కొద్ది సేపట్లోనే ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

బిస్కెట్లు తిన్న ఇద్దరు చిన్నారులకు వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో భయపడిన ఓం రెడ్డి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అసలే కరోనా కాలం. ఎలాంటి లక్షణాలు కనిపించినా.. కరోనాగా భావిస్తున్నారు. అందుకే తండ్రి ఓం రెడ్డి తన పిల్లలకు ఏమైందనే ఆందోళన చెందాడు. వెంటనే తండ్రి వారిద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స చేసిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయిందని వెల్లడించారు. అయితే ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలేంటని ఆరా తీశారు. పతంజలి నుంచి తీసుకొచ్చిన బిస్కెట్లు తినిపించినట్లు తెలుసుకున్నాడు. దీంతో వెంటనే ఓం రెడ్డి పతంజలి షాపు యజమాని దగ్గరి వెళ్లి నిలదీశాడు. దీంతో ఆ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. వెంటనే ఓం రెడ్డి షాపు ముందర నిలబడి ధర్నాకు దిగాడు.

దీంతో ఓం రెడ్డి రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పతంజలి స్టోర్‌కు వెళ్లిన పోలీసులు ఎంక్వైరీ జరిపారు. బిస్కెట్ బాక్స్ ఓపెన్ చూసి చూస్తే ఎక్స్‌పైరీ డేట్ అయిన బిస్కెట్లు కనిపించాయి. వెంటనే పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఎక్స్‌పైరీ డేట్ మూడు నెలలు దాటిన పతంజలి బిస్కెట్లు ఎలా అమ్ముతున్నారని పోలీసులు నిలదీశారు. పతంజలి బిస్కెట్లు అమ్ముతున్న షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓం రెడ్డి డిమాండ్ చేశాడు. కరోనా వేళ.. అన్ హెల్తీ ఫుడ్ ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: