తిరుపతిలోని ఓ పెట్టే కలకలం రేపుతోంది.. ఆ పెట్టెలో ఏముంది అనేది ఉత్కంఠ ను రేపుతోంది.ఆందోళనకు గురి చేస్తుంది..వివరాల్లోకి వెళితే..తిరుపతిలోని శేషాచలం కాలనీలో 75వ నెంబర్ గది ఉంది. ఏడాదిగా అందులో ఎవరూ ఉండడం లేదు. ఖాళీగా ఉన్న ఆ ఇంటిని తాజాగా టీటీడీ అధికారులు జప్తు చేశారు. తిరుమలలో చాలా కాలరంగా నిర్వాసితుడైన శ్రీనివాసన్ కు.. గతంలో శేషాచల నగర్ లో ఆ ఇంటిని కేటాయించింది టీటీడీ. 

ఎంతోకాలంగా ఆ వ్యక్తి ఆ ఇంటిలో ఉంటున్నా ఎవరితోనూ సంబంధాలు ఉండేవి కావు. ఒంటరిగా జీవిస్తుండడంతో అందులో ఏం జరుగుతోంది అన్నది ఎవ్వరికీ తెలిసేది కాదు.. పగలు కొండపైకి వెళ్లి.. రాత్రి తిరిగి ఇంటికి చేరేవాడు. కానీ, గతేడాది అనారోగ్య సమస్యలు కారణంగా.. శ్రీనివాసన్ గతేడాది మరణించాడు. అయితే అతడికి వారసులు ఎవరూ లేకపోవడంతో అప్పటి నుంచి ఆ గది ఖాళీగా ఉంది. ఆ విషయం అందరికి తెలియడంతో అధికారులు జప్తు చేసుకున్నారు. అయితే ఆ గదికి సంబంధించిన విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అధికారులు అక్కడకు వెళ్ళారు..

అక్కడ ఉన్న పెట్టెలను చూసి షాక్ అయ్యారు.. ఆ పెట్టెల నిండా డబ్బులు ఉన్నాయి.. దాదాపు 11 లక్షలు ఉన్నాయని తెలుస్తోంది.అధికారుల సమక్షంలో డబ్బులు లెక్కపెట్టారు. అయితే చిన్న చిన్న నోట్ల తో పాటు చిల్లర కూడా ఉండడంతో లెక్కింపు చాలా ఆసల్యమైంది. అందులో పది లక్షలకు పైగా నగదు ఉన్నట్టు లెక్కించారు. దీంతో అంత ఆదాయం ఎలా వచ్చిందని అంతా షాక్ గురయ్యారు.తిరుమల దగ్గరకు వచ్చిన వీఐపీల దగ్గర యాచించుకుంటూ జీవినం గడిపేవాడు.. అలాంటి వ్యక్తికి పది లక్షల రూపాయలు ఎలా వచ్చాయని షాక్ తింటున్నారు. మరోవైపు ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. కరోనా కష్టకాలంలో జనాలు డబ్బులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఏ పని చేయని ఒక యాచకుడి దగ్గర పది లక్షల రూపాయాలు ఉండడం గ్రేట్  అని మెచ్చుకున్నారు. ఈ మొత్తం డబ్బును స్వామివారికి ఉపయోగించనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: