వ్యాక్సిన్ పై పలు ఆసక్తికర అంశాలను కేంద్రానికి సూచించింది ప్రజారోగ్య నిపుణుల బృందం. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్, ఎయిమ్స్ వైద్యులు, సోషల్ మెడిసిన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడిమాలజిస్ట్స్ , కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సభ్యులతో కూడిన ఈ బృందం టీకా పంపిణీపై పలు సూచనలు చేస్తూ ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటూ హెచ్చరించింది. దేశంలో పొంచి ఉన్న కరోనా ముప్పును పూర్తిగా అదుపులోకి తీసుకు రావాలన్నా, కొత్త వేరియంట్లు రాకుండా అరికట్టాలి అన్నా ఈ సూచనలు పాటించాలంటూ ఓ నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసింది ప్రజారోగ్య నిపుణుల బృందం. ఈ నివేదికలో ఏముంది అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హడావిడిగా వ్యాక్సిన్ ను అందరికీ అందజేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 

ముందుగా కరోనా ప్రభావం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అటువంటి వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయడం ద్వారా కరోనా ఉదృతి తగ్గుతుంది  కానీ. అందరికీ పంచేస్తే ప్రయోజనం ఉండకపోగా కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. అనగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని  తెలియచేసింది. ఇప్పటికే కారోనాతో బాధపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఇప్పుడే అందరికీ వ్యాక్సిన్ వేయడం మంచిది కాదని ఎవరికైతే ముప్పు ఎక్కువగా పొంచి  ఉంటుందో అటువంటి వారికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తే సరిపోతుందని, అలా కాకుండా ప్రజలకు అంతా వ్యాక్సిన్ అందిస్తే కొత్త రకం స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని తెలియజేసింది.

యువతకు, చిన్నారులకు అత్యవసరంగా ఇప్పుడే అందించాల్సిన అవసరం లేదని ఎవరైతే కరోనా లక్షణాలతో బాధపడుతుంటారో అటువంటి వారికి ప్రాధాన్యమిస్తూ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డెల్టా వేరియంట్ ప్రభావంతో కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఈ తీవ్రతను తగ్గించడం కోసం కోవిషీల్డ్  వ్యాక్సిన్ డోసుల మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించి అందించడం వంటి వాటిపైన దృష్టిపెట్టాలని సూచించింది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వారికి, గుండె మరియు కిడ్నీ జబ్బుల వంటి పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి, వృద్ధులకి వ్యాక్సిన్ ని అందించడం మంచిదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: