ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  చివరకు మోహరింపు లను ఉపసంహరించుకున్నట్లు కనిపించిన చైనా మరోసారి తూర్పు లడక్ ప్రాంతంలో భారీగా మోహరింపులు జరుపుతుండడం సంచలనంగా మారిపోయింది.  అయితే చైనా తమకు కావాల్సినప్పుడల్లా అటు పాకిస్థాన్ తెగ వాడేస్తూ ఉంటుంది.  ఎన్నో రకాల తప్పులు చేసి ఆ తప్పులను పాకిస్తాన్ పైకి నెట్టేస్తూ ఉంటుంది.  ఇక ఇప్పుడు చైనా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.



 దీంతో పాకిస్తాన్లో భయం పట్టుకుంది.  ఎందుకంటే ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తూర్పు లడక్ ప్రాంతంలో చైనా భారీగా మోహరింపులు జరుపుతుంది అంతే కాదు సరిహద్దు ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతోంది.  ఇక అలాంటి సమయంలోనే  చైనా పాకిస్తాన్ తో కూడా కాశ్మీర్ ప్రాంతంలో మోహరింపు లను చేయిస్తుంది. అయితే అటు చైనా చెప్పింది కదా అని పాకిస్థాన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు . ఇలాంటి క్రమంలోనే అటు భారత్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది.



 చైనా ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తుంది అన్న కారణం తో చైనాకు మద్దతుగా ఉన్న పాకిస్థాన్ పై ప్రతీ కారం తీర్చుకునేందుకు అటు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే ఎప్పుడు డబుల్ గేమ్ ఆడే చైనా  ఏ క్షణంలోనైనా  సరిహద్దుల్లో మోహరింపు లను ఉపసంహరించుకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చైనా చెప్పింది అని సరిహద్దుల్లో భారీగా మోహరించిన  పాకిస్థాన్ కు చైనా ఇలా చేస్తే సమస్యగా మారే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే అటు ప్రపంచ దేశాలు సైతం పాకిస్థాన్ తీరును తప్పుబడతాయ్. ఇక ఆయుధాలను మొహరించినందుకుగాను భారత్ కూడా పాకిస్తాన్ వదిలిపెట్టే అవకాశం లేదు. ఇలా పాకిస్తాన్ చైనా ను నమ్ముకుని ముందడుగు వేసినప్పటికీ చివరికి ఏం జరుగుతుందో అని భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: