ఏపీలో పెట్టుబడుల కోసం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ, ఎన్ఐసిడిఐటి లు సంయుక్తంగా ఎన్ కె ఐ సి డి ఎల్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈఎస్పివిలో కేంద్ర, రాష్ట్రాల ల వాటాలు 50 - 50 ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా చెన్నై, బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో ని కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ కు మరింత ప్రోత్సాహం, సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కోసం 1448 కోట్లు రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ గత నెల 11న పరిశ్రమలు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 


ఇక ఈ అభివృద్ధి పనులు 2500 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనుండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల ఉద్యోగాలు 2040 నాటికి రానున్నాయని సర్కార్ అంచనా వేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ , ఆటో కాంపోనెంట్స్, టెక్స్టైల్, వేరింగ్ అప్పారల్స్ , కెమికల్ ఫార్మాస్యూటికల్ ,విద్యుత్ ఉపకరణాల తయారీ, కంప్యూటర్ ఉపకరణాల తయారీలు ఇక్కడి ప్రాధాన్య రంగాలుగా భావిస్తున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోట్ లో రోడ్లు, బ్రిడ్జిలు, మౌలిక సదుపాయాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పరిపాలనా భవనాలు, విద్యుత్ సరఫరా యంత్రాంగం, మంచినీటి సరఫరా తదితరాలతో కలిపి అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 1448 కోట్లకు గాను టెండర్ డాక్యుమెంట్ ని జుడిషియల్ ప్రివ్యూ కొరకు అప్లోడ్ చేస్తూన్నట్లు తాజాగా ప్రకటన చేసింది ప్రభుత్వం. 

 

ఈ ప్రాజెక్టు పై ప్రజలు తమ సూచనలు, సలహాలు ఏడు వర్కింగ్ డేస్ లో ఈ website లేదా email కు పంపచ్చు.

Website link:

https://judicialpreview.ap.gov.in

Email id: judge-jpp@ap.gov.in, apjudicialpreview@gmail.com ఈ మేరకు ఏపీఐఐసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ పేరుతో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: