కరోనా వైరస్ కష్ట కాలంలో ఎన్నో హృదయవిదారక ఘటనలు ఎంతో మందిని కలిచి వేస్తున్నాయి.  కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఎంతో మంది పై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు.. మనుషుల్లో మిగిలి ఉన్న కాస్త మానవత్వాన్ని కూడా కనుమరుగయ్యేలా చేసింది. దీంతో సాటి మనిషి కళ్ళముందే ప్రాణాలు పోతున్నా కనీసం సహాయం చేయలేని పరిస్థితికి వచ్చేసాడు మనిషి.  దీంతో ఎంతో మంది ఇక సహాయం చేయడానికి ఎవరూ లేక చివరికి కుటుంబీకుల ప్రాణాలు పోతుంటే తట్టుకోలేక ఎన్నో బాధలు పడుతూ కుటుంబీకులను ఆస్పత్రులకు తరలించిన ఘటనలు ఎంతో మందిని కలిచి వేసాయ్.



 కరోనా వైరస్ సోకిన వ్యక్తిని కనీసం ఆస్పత్రికి తరలించేందుకు కూడా ఎవరూ ముందుకు రాక చివరికి ఎంతోమంది ఇక భుజాలపైన తమ కుటుంబీకుల ను వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనలు కూడా సభ్యసమాజం తీరును చెప్పకనే చెప్పాయి. అంతే కాకుండా ఇటీవల అసోంలో ఓ కోడలు మామ ను వీపుపై వేసుకొని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.  కుటుంబ పోషణ కోసం భర్త వేరే ప్రాంతంలో కి వెళితే ఇక కోడలే ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే మామ కరోనా వైరస్ బారిన పడగా ఎవరు సహాయం చేయకపోవడంతో ధైర్యం తెచ్చుకున్న మహిళ ఏకంగా మామను వీపుపై వేసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది.



 ఈ ఘటనపై ఎన్నో వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కోడలు నిహారిక దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరోజు తన కష్టం చూసి చుట్టూ చేరి అందరు ఫోటోలు తీశారు తప్ప ఎవరు సహాయం చేయడానికి ప్రయత్నించలేదు..  ఫోటోలు చూసినప్పుడు తాను ఒంటరిని అన్న భావన కలిగింది.. ఎదుటివారికి సహాయం చేయలేనప్పుడు ఇక మానవత్వం గురించి మాట్లాడటం ఎందుకు అంటూ ప్రశ్నించింది సదరు మహిళ.  ఇక ఆమె మాట్లాడిన మాటలు కాస్త అందరిని ఆలోచింప చేస్తున్నాయి. కేవలం ఒక్క ఘటనలో మాత్రమే కాదు మనుషుల్లో మానవత్వం కరువైంది అని చెప్పడానికి నిదర్శనం గా దేశంలో ఎన్నో రకాల ఘటనలు కరోనా వైరస్ సమయంలో వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: