చైనా ఎప్పుడు విస్తరణ వాద ధోరణితో వ్యవహరిస్తు ఉంటుంది. కనిపించిన భూభాగమల్ల తమ దేశానికి చెందినది అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అంతే కాదు  చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నింటితో కూడా ఇలా విస్తరణ వాద ధోరణితోనే ఎన్నో వివాదాలు కూడా పెట్టుకుంటూ ఉంటుంది  ముఖ్యంగా చిన్న దేశాలను చైనాలో కలిపేసు కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు చైనా వ్యవహారం కాస్త మరోసారి ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోయింది.



 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు  అందరూ ఒక బృందం గా ఏర్పడి కరోనా వైరస్ కు సంబంధించిన నిజాలను ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యం లో ప్రపంచం ముందు చైనా దోషిగా మారిపోతున్న సమయం లో ప్రపంచం దృష్టిని మరల్చేందుకు ఎత్తుల మీద ఎత్తులు వేస్తోంది చైనా.  ఇప్పటికే భారత్-చైనా సరిహద్దు లో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.  అదే సమయంలో తైవాన్ విషయంలో కూడా ప్రస్తుతం చైనా వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఇప్పటికే భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్న చైనా మరోవైపు..  ఫిలిప్పైన్స్ సరిహద్దుల్లో కూడా యుద్ద నౌకలను మోహరించింది. మరోవైపు తైవాన్ ను ఎప్పటినుంచో ఆక్రమించుకోవాలని భావిస్తున్న చైనా.. అక్కడ కూడా  యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే  తైవాన్ ఆక్రమణ అనేది అంత సులభం కాదని..  మా బలం బలగం అడ్డెసి చైనా నడ్డి విరుస్తాము అంటూ జనరల్ మిల్లి చైర్మన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యూఎస్ ఆర్మీ డైరెక్టుగా చైనా కు వార్నింగ్ ఇచ్చారు.  ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇలా తైవాన్ కు మద్దతుగా యూఎస్ ఆర్మీ రావడంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: