గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి  ఇతర దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మరోవైపు ఇక పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ఆర్మీ మాత్రం పాకిస్థాన్ సైన్యంపై ఎప్పటికప్పుడు దాడులకు దిగుతు షాక్ ఇస్తూ వస్తోంది.  పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ఆగడాలను అరికట్టేందుకు..  పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టేందుకు ఎన్నో రోజుల నుంచి బెలూచిస్తాన్ ఆర్మీ ప్రస్తుతం పాకిస్థాన్లో దాడి చేస్తోంది  ఈ క్రమంలోనే పాకిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారిపోతున్నాయి.



 గత కొన్ని రోజుల నుంచి బెలూచిస్తాన్ ఆర్మీ- పాక్ సైన్యం మధ్య జరుగుతున్న సంఘర్షణలు పతాకస్థాయికి చేరుకున్నాయి.  బెలూన్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యం మధ్య తరచు పరస్పరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే మరోసారి ఐదు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ ఘర్షణల్లో ఎంత మంది చనిపోయారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి భారత ఆర్మీ పై దాడి చేయాలి అనుకున్నప్పుడల్లా అటు బెలూచిస్తాన్ ఆర్మీ పాకిస్థాన్ సైన్యం పై విరుచుకు పడుతుంది.




 అంతే కాకుండా మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం సైతం పాకిస్తాన్ పై విరుచుకుపడుతూ ఉండటంతో ప్రస్తుతం పాకిస్తాన్ కి వరుస షాకులు తగులుతున్నాయి. అయితే ఇలా బెలూచ్ తిరుగుబాటుదారులు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం.. పాకిస్తాన్ పై దాడి చేయడానికి వెనుక భారత్ ప్రోద్బలమే వుంది అంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది కానీ దీనికి సరైన ఆధారాలు లేకపోవడంతో చివరికి పాకిస్తాన్ సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఇకపోతే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి మరీ అక్కడ భారీగా మోహరింపులు జరుపుతుంది పాక్ ఆర్మీ.  ఈ నేపథ్యంలోనే బెలూన్ తిరుగుబాటుదారులు దాడి చేయడం సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: