ప్రసిద్ద కంపెనీలకు నెలవైన బెంగళూరు ప్రాంతంలో పాటు పలు జిల్లాల్లో అన్ లాక్ మొదలైంది. కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సవరించింది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు వదిలారు. కరోనాను అంతం చేయడం కోసం ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకున్నాయి. లాక్ డౌన్ నియమాలు, ఆంక్షలను విధిస్తూ చాలా వరకూ కరోనా కేసులు రెట్టింపు కాకుండా చేశాయి. ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించి నియమాలను పాటించారు. ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడటం, మాస్కులు పెట్టుకోవడంతో కేసులు తగ్గాయి. ఇటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కరోనా కేసులు తగ్గడం వల్ల అన్ లాక్ ను అమలు చేస్తున్నాయి. తాజాగా కర్ణాటక సీఎం యడియూరప్ప తమ రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియను అమలు చేశారు. అయితే కరోనా కేసులు ఇంకా ఉన్నటువంటి 11 జిల్లాల్లో లాక్ డౌన్ ను కొనసాగించనున్నారు. కర్ణాటకలో జూన్ 14వ తేదీతో లాక్ డౌన్ గడువు ముగిసిపోతుంది. దీంతో ప్రజలు ఆ తర్వాత అన్ లాక్ విధిస్తారని ఎదురుచూస్తున్నారు. అయితే సీఎం బీఎస్.యడియూరప్ప అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. జూన్ 14వ తేదీ నుంచి కొన్ని ప్రాంతాల్లోనే లాక్ డౌన్ నియమాలను సడిలించారు.

సీఎం యడియూరప్ప అధికారులు, మంత్రులు, వైద్యశాఖ నిపుణులతో సమావేశాలు నిర్వహించారు. తదుపతి ఎటువంటి నియమాలు పెట్టాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనేదానిపై సమావేశంలో చర్చించారు.  కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు, బెళగావి, శివమొగ్గ, దావణగెరె, చిక్కమగళూరు, చామరాజనగర, హాసన్, దక్షిణ కన్నడ జిల్లా, కోడుగు, మండ్య జిల్లాలో లాక్ డౌన్ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నాం 2 గంటల వరకు కచ్చితంగా నియమాలు అనేవి ఉంటాయన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని 11 జిల్లాల్లో లాక్ డౌన్ నియమాలు మామూలుగానే ఉంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అనేది కఠినంగా ఉంటుందని, నియమాలు పాటించని వారికి జరిమానా ఉంటుందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: