ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా మొన్న‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను పెద్ద‌గా రానివ్వ‌లేదు అధికారులు. అయితే ఇప్పుడు మాత్రం వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు గ‌దులు కేటాయించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందుకోసం టీటీడీకి వచ్చే భ‌క్తుల‌కు గ‌దుల కోసం ఆరు రిజిస్ట్రేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. భ‌క్తులు ఇందులో రిజిస్ట్రేష‌న్ చేసుకుని గ‌దులు పొంద‌వ‌చ్చు.

ఇక నుంచి తిరుమలకు వచ్చే వారికోసం గదుల కేటాయించే విధంగా ఈ ర‌క‌మైన చ‌ర్య‌లు తీసుకుంది టీటీడీ. సాధారణ భక్తులకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కౌంట‌ర్లు ఉంటాయి. జీఎన్ సీ, బాలాజీ బస్టాండ్ తో పాటుగా కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ ఎంబీసీ వద్ద భ‌క్తులు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. కాగా ఈ రిజిస్ట్రేష‌న్ కేంద్రాలను శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్టార్ట్ చేశారు. అనంతంర ఆయన విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. కొత్త‌గా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఈజీగా అద్దె గదులు భ‌క్తుల‌కు అందుతాయ‌న్నారు.

ప్ర‌స్తుతం ఏర్పాటు చేసిన ఈ ఆరు కౌంటర్ల ద్వారా ఎక్కడైన గదులు బుక్ చేసుకోవచ్చని ధ‌ర్మారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న గదులు కేటాయించే సీఆర్ఓ ఆఫీసు ద‌గ్గ‌ర భక్తుల రద్దీ బాగా ఉంద‌ని, దీంతో అక్క‌డ వాహనాల నిల‌ప‌డం చాలా ఇబ్బందిగా మారింద‌న్నారు. ఈ కార‌ణాల వ‌ల్ల వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టి ఈ విధ‌మైన రిజిస్ట్రేష‌న్లు చేస్తున్న‌ట్టు వివ‌రించారు.

భ‌క్తుల కోస‌మే ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ధర్మారెడ్డి చెప్పారు. తాము పెట్టిన ఆన్ లైన్ ప‌ద్ధ‌తిలో గదులు బుక్ చేసుకున్న వారెవ‌రైనా కొత్త‌గా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేష‌న్ కౌంటర్లలో క‌చ్చితంగా త‌మ వివ‌రాలు న‌మోదు చేసుకోవాల‌న్నారు. వారికి ఈ అవకాశం కల్పించారు ధ‌ర్మారెడ్డి. గది కేటాయింపుకు సంబంధించిన పూర్తి సమాచారం భ‌క్తుల‌కు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా వ‌స్తుంద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd