ప్రస్తుతం ప్రభుత్వ రంగ బీమా సంస్థగా భీమా రంగం లో టాప్ ప్లేస్ లో కొన సాగుతోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజల నమ్మకాన్ని కూడ గట్టుకుంది ఎల్ఐసి  సంస్థ. ప్రస్తుతం భీమా రంగం లో ఎప్పటికప్పుడు తమ పాలసీ దారుల సంఖ్యను పెంచుకుంటూ దూసుకు పోతుంది. ఇక ఈ ప్రస్తుతం కస్టమర్ల కోసం ఎన్నో పాలసీలను అందిస్తోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ తమ పాలసీ దారులకు అందుబాటులో ఉంటూ వస్తోంది. పాలసీదారులు రక్షణ విషయం లో కూడా ఎప్పటికప్పుడు వినియోగ దారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది.




 ఇటీవలే  సోషల్ మీడియా వేదికగా తమ వినియోగ దారులకు ప్రజలకు కీలక విషయాన్ని తెలుపుతూ హెచ్చరికలు జారీ చేసింది . లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థకు చెందిన కంపెనీ లోగో  ఎవరు ఉపయోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎల్ఐసి . కంపెనీ అనుమతి ఉంటేనే ఎల్ఐసి లోగో ఉపయోగించాలని.. ఇక మిగతా ఎవ్వరూ కూడా ఎల్ఐసి లోగో ఉపయోగించకూడదు అంటూ తెలిపింది. ఒకవేళ నిబంధనలను అతిక్రమించి ఉపయోగిస్తే.. వారు శిక్షార్హులే అంటూ తెలిపింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.



 ఏదైనా వెబ్ సైట్ కానీ లేదా ఇతరులు, వ్యాపారులు కూడా ఎల్ఐసి కంపెనీకి సంబంధించిన లోగో ఉపయోగించేందుకు అనుమతి లేదు అంటూ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంస్థ సిద్ధంగా ఉంది అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో అటు ఎల్ఐసి వినియోగదారులందరిని అలర్ట్ చేసింది.  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ వినియోగదారుల కు ఫోన్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ కార్డు నెంబర్ లాంటి వివరాలు అస్సలు అడగదని.. ఒకవేళ అపరిచిత నెంబర్ నుంచి  కాల్స్ వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: