ప్రస్తుతం చైనాలో వెలుగు లోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను మొత్తం చుట్టేసింది.  అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని దేశాల లో విజృంభిస్తుంది ఈ మహమ్మారి వైరస్.  ఇక క్రమ క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాలు పట్టి పీడిస్తోంది. ఈ క్రమం లోనే ప్రస్తుతం వైరస్ పై పోరాటం లో భాగం గా ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగం గా కొన సాగిస్తున్నాయి.  ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందితే వైరస్ పోరాటం లో విజయం సాధించవచ్చు అని భావిస్తున్నాయి.  కానీ కొన్ని దేశాల్లో ప్రజల నుంచి మాత్రం పూర్తి స్థాయి మద్దతు లభించడం లేదు.



 ఉచితం గా వ్యాక్సిన్ ఇస్తామని అటు ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఎవరు కూడా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి నేపథ్యం లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగించేందుకు పలు దేశాల ప్రభుత్వాలు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏకంగా బహుమతులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నాయి.  ఇప్పటికే పలు దేశాలు ఇలాంటి ఆఫర్లు ప్రకటించాయి. ఇక మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.



 ఇటీవలే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇలాంటి తరహా చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ పోరాటం లో కీలకమైన వ్యాక్సిన్ విషయం లో పాకిస్థాన్లోని పంజాబ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో తొలి డోస్ తీసుకున్న మూడు లక్షల మంది ఇక రెండవ డోసు కోసం సమయం ముగిసి నప్పటికీ ఇక తీసుకోవడానికి ముందుకు రావడం లేదని.. అలాంటి వారికి సిమ్ కార్డులను బ్లాక్ చేసేందుకు నిర్ణయించాము అంటూ అక్కడి ప్రభుత్వం తెలిపింది.  అంతేకాదు రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఎప్పటికప్పుడు అటు ప్రజలకు అవగాహన కల్పిస్తుంది అక్కడి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: