రాజీనామా చేసిన అనంతరం ఈటల రాజేందర్ గన్ పార్క్ లో మీడియాతో మాట్లాడారు ఈ సంధర్భంగా సీఎం కేసీఆర్ కు ఈటల సవాల్ విసిరారు. టీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మంత్రులను చేసి నీచ సంస్కృతికి కేసీఆర్ తెరతీశారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉమ్మడి పాలకులపై అసెంబ్లీ వేదికగా గర్జించిన చరిత్ర నాకుందన్న ఈటల నాలాంటి బలహీన వర్గానికి చెందిన వాడిపై ప్రణాళికతో ఆరోపణల చేశారని అన్నారు. హుజురాబాద్ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని అన్నారు. 

హుజురాబాద్ ఉప ఎన్నిక కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం అన్న ఆయన లెఫ్ట్, రైట్ కాదు..  కేసీఆర్ నియంతృత్వ పాలనకు గోరీ కట్టడమే లక్ష్యంగా ఇకపై పనిచేస్తానని అన్నారు. నాకు  జైళ్లు, కేసులు కొత్త కాదు. ఈటల రాజేందర్ డీఎన్ఏ లోనే  లౌకిక వాదం ఉందని అన్నారు.  కొత్త పార్టీ పెట్టాలని చాలామంది శ్రేయోభిలాషులు నన్ను కోరారని అన్నారు. ఇక స్పీకర్ ను కలిసి రాజీనామా ఇవ్వాలనుకున్నానని కానీ కోవిడ్ ను అడ్డం పెట్టుకుని స్పీకర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అన్నారు. వారం రోజులు ప్రయత్నం చేసినా అపాయింట్ మెంట్ సాధ్యం కాలేదని, అనివార్యంగా ఈ రోజు రాజీనామా ను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చానని అన్నారు.

అసెంబ్లీ గేట్ల వద్ద నా సహచరులు, అనుచరులను అడ్డుకున్నారని అన్నారు. గతంలో ఉన్న సంప్రదాయాలు తుంగలో తొక్కారని అన్నారు. ప్రగతి భవన్ వెకిలి చేష్టలు మానుకోకపోతే పరాభవం తప్పదన్న ఆయన టిఆర్ఎస్ కు ఓటు వేయకపోతే పెంచన్లు రావని బెదిరిస్తున్నారని అన్నారు. అవి మీ ఇంటి డబ్బులు కాదు, ప్రజలు అమాయకులు కాదని, పోలీస్, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో మిమ్మల్ని తొక్కి పడేస్తారని అన్నారు. మంచి మెజారిటీ తో మళ్ళీ గెలిచి వస్తానన్న ఆయన గత ఎన్నికల్లోనే కౌశిక్ రెడ్డికి డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రగతి భవన్ నుంచే సమాచారం ఇచ్చి ప్రతిరోజు  నా మీద మాట్లాడించారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: