కొంత‌మంది దీన గాధ‌లు వింటే గుండెలు త‌రుక్కుపోతాయి. వారికి ఏదైనా సాయం చేద్దామ‌ని ప్ర‌తి ఒక్క‌రికీ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌టనే ప్ర‌పంచాన్ని ఒక్క‌టి చేసింది. పుట్టుకతోనే ఆ బాలుడికి అతి అరుదైన స్పైనల్ మస్కులర్‌ ఆట్రోఫీ అనే వ్యాధితో అవ‌స్థ ప‌డుతున్నాడు. దీంతో ఆ మూడేళ్ల బాలుడిని కాపాడేందుకు ఇంపాక్ట్ గురు ఆన్‌లైన్ వేదిక‌గా విరాళాలు సేక‌రించింది.

దీంతో అనూహ్యంగా ప్రపంచ వ్యాప్తంగా 62,400 మంది దాతలు విరాళాలు ఇవ్వ‌డంతో ఇంకా చాలామంది ముందుకొస్తున్నారు. ఇంపాక్ట్‌ గురు సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా సంవ‌త్స‌ర కాలంగా దాదాపు రూ.16 కోట్ల వ‌ర‌కు విరాళాలు సేక‌రించింది. చందానగర్‌కు చెందినటువంటి ఓ సాఫ్ట్‌వేర్ భార్యాభ‌ర్త‌ల‌కు మూడేళ్ల కింద‌ట అయాన్ష్‌ గుప్తా అనే బాబు జన్మించాడు. కాగా శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాబు బాధపడుతుండటంతో త‌ల్లిదండ్రులు వెంట‌నే డాక్ట‌ర్‌కు చూపించారు. ఇందుకోసం సికింద్రాబాద్‌ రెయిన్‌బో హాస్పిట‌ల్‌కు చెందిన పీడియాట్రిక్‌ న్యూరాలజిస్ట్ అయిన రమేష్‌ కోణంకికి చూపించ‌గా.. ఆయ‌న టెస్టులు చేశారు. ఇందులో బాబు పుట్టుకతోనే అరుదైన వెన్నెముక సంబంధిత సమస్య అయిన స్పైనల్ మస్కులర్‌ ఆట్రోఫీకి గురియిన‌ట్టు చెప్పారు.

అయితే ఈ రోగానికి చికిత్స చేయాలంటే చాలా ఖ‌ర్చ‌వుతుంద‌ని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు డాక్ట‌ర్ల సూచ‌న మేరకు ఆన్‌లైన్‌ వేదికగా విరాళాలు సేకరించే ఇంపాక్ట్‌ గురు స్వ‌చ్ఛంద సంస్థను కోరారు. వారు కూడా వెంట‌నే స్పందించి విరాళాలు సేక‌రిస్తున్నారు. బాబుకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే జొలెస్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాల‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. కాగా అమెరికా నుంచి వ‌చ్చే ఈ ఇంజ‌క్ష‌న్ కు కేంద్రం రూ.6 కోట్లు ట్యాక్సును క్యాన్సిల్ చేసింది. కాగా దాత‌ల ద్వారా వ‌చ్చిన 16 కోట్లతో ఇంజ‌క్ష‌న్ చేసి బాలుడికి ట్రీట్ మెంట్ ఇచ్చారు డాక్ట‌ర్లు. ఇప్పుడు ఆ బాలుడు కోలుకోవడంతో హాస్పిట‌ల్ నుంచి డాక్ట‌ర్లు ఇంటికి పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: