హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కేసీఆర్ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆరోగ్య శాఖ మంత్రిగా తొలగించిన నాటి నుంచి ఈటెల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఈటెల ఏ పార్టీ లోకి వెళ్లబోతున్నారు అనే ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. చివరకు బీజేపీ లోకి వెళ్ళ బోతున్నారు అన్నది కన్ఫామ్ అయ్యింది. అయితే కేవలం టిఆర్ఎస్ జండా తోనే ఈటెల గెలిచాడు అని టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల ఏకంగా  టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.



 ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతాను అంటూ శబధం చేశారు. ఈటెల రాజీనామాతో బీజేపీలో చేరడం ఫిక్సయిపోయింది . అయితే బీజేపీలో చేరేందుకు ఈటెలతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ కీలక నేతలు కూడా సిద్ధమైనట్లు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కి ఎంతో సన్నిహితుడైన వ్యక్తి కూడా ప్రస్తుతం ఈటలతో బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారట.



 తెలంగాణ ఆర్టీసీ సమ్మె లో ఎంతో కీలకంగా వ్యవహరించిన అశ్వద్ధామ రెడ్డి కూడా ప్రస్తుతం కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు ఫిక్స్ అయ్యారట. ఈనెల 14వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న అశ్వత్థామరెడ్డి అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు  తెలుస్తోంది. అయితే ఆర్టీసీ జేఏసీ చైర్మన్ గా ఉన్న సమయంలో అశ్వత్థామ రెడ్డి అటు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎక్కువగా ఉండడానికి అశ్వత్థామరెడ్డి కారణం. అంతేకాదు ఇక ఉద్యమ కాలం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా హరీష్ రావుకు  అశ్వత్థామరెడ్డి ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక ఆయన కూడా ఇప్పుడు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉండటంతో టీఆర్ఎస్కు షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: