జగన్ ఢిల్లీ టూర్ లో అసలు ఏం జరిగింది. ఆయన రెండు రోజుల పాటు బిజీగా గడిపారు. అయిదుగురు కేంద్ర మంత్రులను కలిశారు. ఇక సీఎం ఆఫీస్ జగన్ టూర్ మీద ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసింది. అదే సమయంలో తెలుగు మీడియా జగన్ టూర్ విషయంలో అసలు విషయాలను తెలుసుకోలేకపోయింది అన్న టాక్ అయితే ఉంది.

జగన్ ఎపుడు ఢిల్లీ వెళ్ళినా కూడా రచ్చ చేసే ఒక విపక్ష పార్టీ  అనుకూల మీడియా ఇపుడు అలాగే చేసింది. ఆయన్ బెయిల్ రద్దు పిటిషన్ కోర్టులో ఉండడంతో దాని మీద కేంద్ర పెద్దలను కలిశారని, ఆయన మీద ఉన్న సీబీఐ కేసుల పరంగా మంతనాలు జరిపారని రాసుకొచ్చిందే తప్ప నిజానికి ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ చేస్తే ఏం జరిగింది అన్నది వాస్తవాలు పెద్దగా రాయలేదు అన్నది అయితే ప్రచారంలో ఉంది.

అయితే జగన్ ఢిల్లీ టూర్ మీద జాతీయ మీడియా మాత్రం కొన్ని విషయాలను రాబట్టినట్లుగా ఉంది. జాతీయ మీడియాలో డిఫరెంట్ గా జగన్ టూర్ వచ్చింది. ఆయన ఆరు నెలల తరువాత ఢిల్లీకి రావడం, పైగా హోం మంత్రి అమిత్ షా తో చర్చలు జరపడం వంటివి రాస్తూనే ఆయన కేంద్ర పెద్దల వద్ద అనేక డిమాండ్లు పెట్టారని, అవన్నీ రాష్ట్ర అభివృద్ధికి  సంబంధించినవే అని కూడా పేర్కొంది. తాను సీఎం గా రెండేళ్ల కాలం పూర్తి చేశానని మిగిలి ఉన్న విలువైన కాలంలో అనుకున్నట్లుగా పనులు కాకపోతే ఇబ్బంది అవుతుంది అన్న ఆవేదనతోనే జగన్ ఈసారి కేంద్ర పెద్దలతో గట్టిగానే మాట్లాడారు అన్నట్లుగా జాతీయ మీడియాలో కధనాలు కొన్ని వచ్చాయి.

ఇక పోలవరం ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితులో తన హయాంలో పూర్తి చేయాలని జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే దీని వయసు ఎనభయ్యేళ్ళు అయినా తన తండ్రి వైఎస్సార్ హయాంలోనే ఇది తిరిగి పురుగు పోసుకుంది. దాంతో తాను సీఎం గా పూర్తి చేయడం ద్వారా అటు ప్రజలకు, ఇటు తన తండ్రికి కూడా రుణం తీర్చుకోవాలని జగన్ భావిస్తున్నారుట. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా చూడాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారుట. ఇక కేంద్రం నుంచి నిధులు  రావాలని, విభజన హామీలు పూర్తిగా నెరవేరచాలని కూడా జగన్ కేంద్ర పెద్దలను కోరినట్లుగా చెబుతున్నారు. మరి జగన్ టూర్ మీద ఇప్పటికీ రాజకీయమే అజెండా అని మాత్రమే  ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాయడం అంటే అసలు నిజాలు పక్కకు పెట్టినట్లేనా.


మరింత సమాచారం తెలుసుకోండి: