ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్న అది పెద్ద సంచలనమే అని చెప్పాలి.  ఈ రెండేళ్ల కాలంలో జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఐదుగురుకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం అనేది కూడా ఒకటి. గతంలో చంద్రబాబు, ఇద్దరికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఓసీ వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు, బీసీ వర్గానికి చెందిన కే‌ఈ కృష్ణమూర్తిలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే వారు మంత్రులు కూడా ఉన్నారు.


ఇక జగన్ అధికారంలోకి వచ్చాక అయిదుగురికి మంత్రి పదవులతో పాటు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఎస్టీ వర్గానికి చెందిన పాముల పుష్పశ్రీవాణికి, ఓసీ వర్గానికి చెందిన ఆళ్ళ కాళీ కృష్ణశ్రీనివాస్(నాని)కి, ఎస్సీ వర్గానికి చెందిన నారాయణస్వామికి, మైనారిటీ వర్గానికి చెందిన షేక్ అంజాద్ బాషాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే మొదట్లో బీసీ వర్గానికి చెందిన పిల్లి సుబాష్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండగా, ఆయన రాజీనామా చేశాక ఆ హోదా ధర్మాన కృష్ణదాస్‌కు దక్కింది. ధర్మాన సైతం బీసీ వర్గానికి చెందిన నాయకుడే.


ఇలా ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే మరో ఆరు నెలల్లో జగన్ కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. ఇక అప్పుడు ఈ ఐదుగురులో ఎవరు మళ్ళీ కంటిన్యూ అవుతారు? అలాగే వీరిలో జగన్ ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.


ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఐదుగురుని ఉంచిన, ఐదుగురుని తీసేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ రెండేళ్లలో ఐదుగురు డిప్యూటీ సీఎంల్లో మంచి పనితీరు కనబర్చిన వారు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్‌తో సన్నిహితంగా ఉండే ఆళ్ళ నాని ఐదేళ్లు కంటిన్యూ అవుతారని తెలుస్తోంది. మరి చూడాలి ఈ ఐదుగురు డిప్యూటీ సీఎంల విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: