రాజకీయాల్లో నాయకులు జంపింగులు సర్వ సాధారణమే. అధికారమే లక్ష్యంగా నేతల వలసలు ఉంటాయి. అలాగే ప్రత్యర్ధులని వీక్ చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వలసలని ప్రోత్సహిస్తాయి. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇలాగే ముందుకు నడిచింది. వరుసపెట్టి వైసీపీ నేతలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని చేర్చుకుంది. అటు అధికారం కోసం వైసీపీ వాళ్ళు కూడా టీడీపీలోకి జంప్ కొట్టారు.


ఇక ఇప్పుడు అధికారం వైసీపీది కావడంతో టీడీపీ నేతలు జంపింగ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలోకి వచ్చారు. అలాగే నలగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా డైరక్ట్‌గా వైసీపీలో చేరకుండా జగన్‌కు మద్ధతు తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు లాజికల్‌గా ఎలా చేసిన అవి కూడా జంపింగులే.  అయితే టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నలుగురు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు 19 మంది ఉన్నారు.


అయితే రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు జంప్ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ, వారి గోడ దూకుడు కార్యక్రమం ఆగింది. అయితే ఇప్పటికీ ఆ టీడీపీ ఎమ్మెల్యేలు డౌట్‌గానే ఉన్నారని చెప్పొచ్చు. అలా డౌట్‌గా ఉన్న ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. అసలు ఈయన పార్టీ మారడం ఖాయమని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గంటా ఎటు వెళ్లలేదు. అలా అని టీడీపీలో కనిపించడం లేదు.


అటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైతం వైసీపీ వైపుకు వెళ్ళడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇక రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబులు సైతం పార్టీ మారిపోతారని వార్తలు వచ్చాయి. కాబట్టి భవిష్యత్‌లో టీడీపీలో ఈ ఎమ్మెల్యేలు కాస్త డౌటే అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: