ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకునే విషయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. నిజానికి కేంద్రం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రెండో డోస్ వేసుకోవాలి అంటే అందుకు ఎనభై నాలుగు రోజుల వ్యవధి అవసరం ఉంటుంది. ఈ విషయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు మొదటి డోస్ తీసుకున్న తర్వాత 28 రోజుల్లోనే రెండవ డోసు పొందవచ్చని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. 


మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు లక్షల 60 వేల కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పూణేలోని శ్రీ రామ్ ఇన్స్టిట్యూట్ నుంచి గన్నవరం  విమానాశ్రయానికి ఈ కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో దాదాపు 30 బాక్సుల్లో ఈ కరోనా వ్యాక్సిన్ డోసులు గన్నవరం చేరుకున్నాయి. ఆ వ్యాక్సిన్ ను ముందుగా గన్నవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు అధికారులు. 


ఆ టీకా కేంద్రం నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలతో ఏ జిల్లాకు ఆ జిల్లా సపరేట్ గా పంపిణీ ప్రారంభం కానుంది. తాజాగా చేరుకున్న కరోనా వ్యాక్సిన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు కొంతలో కొంత ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇక మరో పక్క జూన్ 21వ తేదీ నుంచి 18 ఏళ్ళు పూర్తయిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 45 సంవత్సరాలు పూర్తయిన వారందరికీ కూడా వ్యాక్సిన్ పూర్తయినట్లు దాఖలాలు లేవు. అందుకే ఈ వ్యాక్సిన్ కొరతను అధిగమించడాని కోసం కేంద్రం అనేక ప్రయత్నాలు కూడా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: