ప్రజల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన కరోనా వైరస్ కి ప్రపంచ దేశాలు పది రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో వ్యాక్సిన్ మిషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా తొలి దశలో ఉన్న వారికి పారాసెట్మాల్, జలుబు దగ్గు సంబంధించినటువంటి మాత్రలను వాడటం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రెమిడీసివెర్ వంటి మందులతో చికిత్సను అందింస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనాకు వెంటనే పూర్తి చెక్ పెట్టే దిశగా పలురకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ డ్రగ్‌’ కరోనాపై అద్భుతంగా పనిచేస్తుంది అంటూ వైద్యులు శుభవార్త అందించారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఏఐజీ, యశోద ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలో భాగంగా దాదాపు రెండు వారాలకు పైగా ఈ డ్రగ్ ను డాక్టర్లు వినియోగిస్తున్నారు. అయితే కరోనాను నియంత్రించడంలో ఈ డ్రగ్ చాలా ప్రభావితంగా పనిచేస్తోందని, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఈ మందు ఇవ్వాల్సి ఉందని వారు చెబుతున్నారు. ఇంజక్షన్ రూపంలో దొరికే కాక్ టెయిల్ డ్రగ్ తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్ శాతం కూడా చాలా తక్కువగానే ఉన్నాయని డాక్టర్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ ను నియంత్రించడమే కాకుండా వివిధ రకాల వేరియంట్లు వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు ఈ ఔషధం సమర్థవంతంగా పని చేస్తుంది అంటూ, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ డ్రగ్‌ గురించి తమ అధ్యయన వివరాలను వెల్లడించారు వైద్యులు.

అంతేకాకుండా ఈ ఔషధం వాడటం వలన 70 శాతం వరకు మరణాలు తగ్గుముఖం పట్టినట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఇంజక్షన్ ఎక్కువ వయసున్నవారు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు మరియు మరణానికి దగ్గరగా ఉన్న వారిపై సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి తెలియచేశారు. ఈ ఇంజక్షన్ ధర అమెరికాలో చాలా ఎక్కువగానే ఉంన్నట్లు తెలుస్తోంది. కానీ ఇది మన ఇండియాలో ఒక్క ఇంజక్షన్ 60 వేల రూపాయలకే లభించనుందని చెప్పారు. ఈయన కారొనను తప్పక తగ్గిస్తుందని ఫుల్ భరోసా ఇస్తున్నారు. తొలుత అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వినియోగంలో ఉన్న ఈ డ్రగ్ ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చి అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కానీ డాక్టర్ల సలహా లేకుండా ఈ డ్రగ్ ను వాడరాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మొత్తానికి తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ మందు కరోనాను కట్టడి చేస్తూ ప్రజలకు ఊరట కలిగిస్తోంది. మరి ఇది కరోనా రోగులకు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు త్వరలో తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: