క‌రోరా విజృంభ‌న‌తో ప్ర‌తిఒక్క‌రూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. పూట గ‌డ‌వ‌క ఎంతో మంది అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌ళాకారులు కూడా క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే తాజాగా అలాంటి కళాకారుల‌కు తాజాగా దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు నిత్యావ‌స‌రాలు అందించి క‌రోనా క‌ష్ట‌కాలంలో అండగా నిలిచారు. ఈ కార్య‌క్ర‌మంలో కళాకారులకు చేయూతను ఇచ్చి ద్వారావతి ఫౌండేషన్ ఆదుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో మొత్తం 350మంది కళాకారులకు నెల రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు, నూనె పంపిణీ చేశారు. ఈ సంధ‌ర్బంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ...కరోనా వల్ల అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ఉచితంగా రేషన్, ఇతర వస్తువులు అందిస్తున్నామ‌ని చెప్పారు. 

సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పధకాలు అందించడం సీఎం గొప్పతనం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు. ద్వారావతి ఫౌండేషన్ కళాకారులకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం అభినందనీయమ‌ని మంత్రి ప్ర‌శంస‌లు కురింపించారు. 350మందికి బియ్యం, నూనె, కందిపప్పు అంద చేశామని తెలిపారు. ప్రదర్శనలు లేక పేద కళాకారులు ఎంతో మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఇటువంటి కష్ట సమయంలో ఈ సాయం కొండంత భరోసా ఇస్తుందని వ్యాఖ్యానించారు.

ద్వారావతి ఫౌండేషన్ ప్రెసిడెంట్ చ‌ల‌వాది మల్లికార్జున రావు మాట్లాడుతూ... కరోనా వల్ల చాలా మంది పేదలు నిస్సహాయ పరిస్థితి లో ఉన్నారని అన్నారు. పేదల కోసం క్వారంటైన్ సెంటర్ లు పెట్టామ‌ని చెప్పారు. నాలుగు‌ వందల మందికి  ఉచితంగా వైద్య సేవలు అందించామ‌న్నారు. కళాకారుల బాధలు చూసి గతంలో కొంత సాయం చేశామ‌న్నారు. కష్ట సమయంలో కడుపు నింపేలా నెలకి సరిపడా సరుకులు ఈరోజు అందించామని చెప్పారు. ఆ సాయిబాబా ఆశీస్సుల తో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టామ‌ని వ్యాఖ్యానించారు. పేదల కోసం నిత్యాన్నదానం ఏర్పాటు చేసి.. నిరాశ్ర‌యుల‌ కడుపు నింపుతున్నామని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: