2009 బ్యాచ్ కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి వివాదం అందరికీ తెలిస్ ఉంటుంది. ఈమె ఈ విషయమై తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.
మైసూరు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తోన్న రోహిణిని తాజాగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్‌గా నియమించింది యడియూరప్ప సర్కార్. అయితే ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈమె బదిలీకి వ్యతిరేకత తెలుపుతూ రోహిణి సింధూరికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు ప్రజలు. కన్సర్న్డ్ సిటీజన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ  "బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి" అనే నినాదంతో ఆన్ లైన్ ద్వారా ప్రజల యొక్క సంతకాలను సేకరిస్తుండగా ఈమెకు మద్దతు పలుకుతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రజలు బ్రింగ్ బ్యాక్ రోహిణి అంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆన్లైన్లో సంతకాలు చేస్తున్నారు.


ఎటువంటి తప్పు చేయకుండానే ఓ బాధ్యత గల గొప్ప జిల్లా అధికారిని ఇలా బదిలీ చేయడం సబబు కాదంటూ తమ వ్యతిరేకతకు చూపుతున్నారు. ఒకవేళ అంత పెద్ద కారణాలుంటే వాటిని బహిర్గతంగా ప్రజలకు తెలియజేయాలి అంటూ వాటిని తెలుసుకునే హక్కు మైసూర్ ప్రజలకు ఉందంటూ తమ ఆగ్రహాన్ని ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.   మరో వైపు ఒక తెలుగు మహిళకు కర్ణాటకలో ఇంతటి ఆదరణ లభించడం నిజంగా తెలుగు జాతికే గర్వకారణం అంటూ ఆనందిస్తున్నారు తెలుగు ప్రజలు. భాషా భేదం చూడకుండా నిజాన్ని నిజమంటూ నిక్కచ్చిగా చెబుతూ మద్దతు పలుకుతున్న కన్నడిగులు కూడా చాలా గొప్పవారు అంటూ ప్రశంసిస్తున్నారు.

ఏదేమైనా ఒక జిల్లా అధికారిగా తన బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ, ప్రజల మనసునెరిగిన అధికారిగా పని చేసినందునే నేడు ఐఏఎస్ రోహిణి సింధూరికి ఇంతటి ప్రజాబలం తోడయింది అంటూ దేశం నలుమూలల నుండి ప్రశంసల వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి కోసం ప్రజలు చేస్తున్న ఈ నిరసనకు యడియూరప్ప ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇలాంటి నిజాయితీ అగల అధికారులు పార్టీల స్వార్థానికి ఇంకెంత కాలం బలవ్వాలి అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం తమ వాణిని గట్టిగా వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: